AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీట్‌ యూజీలో ఆల్‌ ఇండియా 3వ ర్యాంక్‌ సాధించిన తెలంగాణ బిడ్డ! ఎలా ప్రిపేర్‌ అయిందంటే..?

తుమ్మల స్నికిత, తెలంగాణకు చెందిన చదువుల తల్లి, 2020 నీట్ యూజీ పరీక్షలో ఆల్ ఇండియా 3వ ర్యాంక్‌ సాధించింది. 720కు 715 మార్కులు సాధించిన ఆమె, 10వ తరగతి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించి, కోచింగ్ తీసుకొని, కష్టపడి చదివి విజయం సాధించింది. ఆమె తల్లిదండ్రులు వైద్యులు కావడం ఆమెకు స్ఫూర్తినిచ్చింది.

నీట్‌ యూజీలో ఆల్‌ ఇండియా 3వ ర్యాంక్‌ సాధించిన తెలంగాణ బిడ్డ! ఎలా ప్రిపేర్‌ అయిందంటే..?
Tummala Snikitha
SN Pasha
|

Updated on: Apr 03, 2025 | 11:42 AM

Share

సరైన మార్గదర్శనం, కష్టపడే తత్వం ఉన్న ఉంటే కచ్చితంగా సక్సెస్‌ అవుతామని నిరూపించింది తెలంగాణ బిడ్డ తుమ్మల స్నికిత. 2020 నీట్ యూజీ పరీక్షలో ఆల్ ఇండియా 3వ ర్యాంక్‌ సాధించి చరిత్ర సృష్టించింది. 720 మార్కులకు గాను ఏకంగా 715 మార్కులు సాధించింది స్నికిత. ఆమె తల్లిదండ్రులు కూడా వైద్య వృతిలోనే ఉండటం, వాళ్ల బాటలోనే తను కూడా నడవాలనుకోవడం, ఆ దిశగా కష్టపడి చదివి సూపర్‌ సక్సెస్‌ అయింది. తెలంగాణకు చెందిన స్నికిత 720 మార్కులకు 715 మార్కులు సాధించి 99.9995611 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అంకితభావం, కృషి, పట్టుదలతో చదివి ఆమె తల్లిదండ్రులను ఎంతో గర్వపడేలా చేసింది. స్నికిత తండ్రి కార్డియాలజిస్ట్ కాగా ఆమె తల్లి గైనకాలజిస్ట్‌.

టెన్త్‌ నుంచే ప్రిపరేషన్‌..

స్నికిత తన నీట్ ప్రిపరేషన్‌ను 10వ తరగతి నుంచే ప్రారంభించింది. అదే విజయానికి బలమైన పునాది వేసింది. ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి ప్రిపేరషన్‌ను మరింత స్ట్రాంగ్‌ చేసుకుంది. కోవిడ్‌-19 లాక్‌డౌన్ ఉన్నప్పటికీ, స్నికిత ప్రిపరేషన్ ఆగలేదు. సిలబస్‌ను ముందుగానే పూర్తి చేసినందున, రివిజన్, టెస్ట్ ప్రాక్టీస్ కోసం స్నికితకు తగినంత సమయం లభించింది. అలాగే ఆన్‌లైన్‌ క్లాసులు కూడా అటెండ్‌ అయింది. నీట్ యూజీ ఆల్‌ ఇండియా స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన స్నికిత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిషన్ పొంది, ఎంబీబీఎస్ విజయవంతంగా పూర్తి చేసింది.

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.