AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anganwadi Jobs: అంగన్‌వాడీల్లో 14,236 పోస్టులతో కొలువుల జాతర..! ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయంటే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. త్వరలో భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్నికల అనంతరం మొత్తం 14,236 అంగన్‌వాడీ పోస్టులతో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు..

Anganwadi Jobs: అంగన్‌వాడీల్లో 14,236 పోస్టులతో కొలువుల జాతర..! ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయంటే..
Anganwadi Jobs
Srilakshmi C
|

Updated on: Feb 23, 2025 | 7:20 AM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయబోతోంది. మొత్తం 14,236 అంగన్‌వాడీ పోస్టులతో బిగ్‌ జాబ్‌ ఫెస్టివల్‌ సెలబ్రేట్‌ చేయబోతుంది. మొత్తం పోస్టుల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 6,399, హెల్పర్‌ పోస్టులు 7,837 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోడ్‌ ముగియగానే జిల్లాస్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం ఇదే తొలిసారి. రాష్ట్రంలని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా ఈ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక టీచర్‌, హెల్పర్‌ తప్పనిసరి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ప్రస్తుతం ఉన్నవారిలో కొందరికీ సూపర్‌వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. మరోవైపు దాదాపు 3,914 మంది 65 ఏళ్ల వయసు నిండి పదవీ విరమణ చేయనున్నారు. ఈ పోస్టులనూ నోటిఫికేషన్లో కలిపి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు పదో తరగతి పాసై ఉంటే సరిపోయేది. కానీ కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల మేరకు టీచర్‌తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్‌ పాసై ఉండాలన్న నిబంధన పెట్టారు. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు మాత్రమే అర్హులు. అలాగే కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీలో 50 శాతం సహాయకులకు కేటాయించాలి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకుల్లో ఇంటర్మీడియట్‌ పాసైన హెల్పర్లు 567 మంది మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు..

  • ఆదిలాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 96, సహాయకుల పోస్టులు 406
  • కొత్తగూడెం జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 158, సహాయకుల పోస్టులు 826
  • హనుమకొండ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 37, సహాయకుల పోస్టులు 140
  • హైదరాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 130, సహాయకుల పోస్టులు 273
  • జగిత్యాల జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 46, సహాయకుల పోస్టులు 172
  • జనగామ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 16, సహాయకుల పోస్టులు 75
  • భూపాలపల్లి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 31, సహాయకుల పోస్టులు 77
  • గద్వాల జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 53, సహాయకుల పోస్టులు 177
  • కామారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 47, సహాయకుల పోస్టులు 269
  • కరీంనగర్ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 50, సహాయకుల పోస్టులు 119
  • ఖమ్మం జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 93, సహాయకుల పోస్టులు 394
  • ఆసిఫాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 91, సహాయకుల పోస్టులు 261
  • మహబూబాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 84, సహాయకుల పోస్టులు 318
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 40, సహాయకుల పోస్టులు 119
  • మంచిర్యాల జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 57, సహాయకుల పోస్టులు 257
  • మెదక్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 25, సహాయకుల పోస్టులు 266
  • మేడ్చల్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 51, సహాయకుల పోస్టులు 157
  • ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 73, సహాయకుల పోస్టులు 233
  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 103, సహాయకుల పోస్టులు 387
  • నల్గొండ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 88, సహాయకుల పోస్టులు 374
  • నారాయణపేట జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 29, సహాయకుల పోస్టులు 106
  • నిర్మల్ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 55, సహాయకుల పోస్టులు 276
  • నిజామాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 50, సహాయకుల పోస్టులు 290
  • పెద్దపల్లి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 37, సహాయకుల పోస్టులు 117
  • రాజన్నసిరిసిల్ల జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 21, సహాయకుల పోస్టులు 53
  • రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 46, సహాయకుల పోస్టులు 365
  • సంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 35, సహాయకుల పోస్టులు 274
  • సిద్ధిపేట జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 57, సహాయకుల పోస్టులు 145
  • సూర్యాపేట జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 61, సహాయకుల పోస్టులు 191
  • వికారాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 49, సహాయకుల పోస్టులు 238
  • వనపర్తి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 34, సహాయకుల పోస్టులు 112
  • వరంగల్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 35, సహాయకుల పోస్టులు 172
  • భవునగిరి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 40, సహాయకుల పోస్టులు 118

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..