AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNTU Hyderabad: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ప్రతి నెలా నాలుగో శనివారం కాలేజీలకు సెలవు!

విద్యార్థులకు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, కార్యాలయాలకు ఇకపై ప్రతి నాలుగో శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ కే వెంకటేశ్వర రావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం ఫిబ్రవరి 22 నుంచే ఇది అమలులోకి రానుంది..

JNTU Hyderabad: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ప్రతి నెలా నాలుగో శనివారం కాలేజీలకు సెలవు!
JNTU Hyderabad
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Feb 21, 2025 | 3:04 PM

Share

హైదరాబాద్, ఫిబ్రవరి 21: జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ (JNTU) గురువారం (ఫిబ్రవరి 20) కీలక ప్రకటన జారీ చేసింది. ఇకపై యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, కార్యాలయాలకు ప్రతి నెలా 4వ శనివారం సెలవు ఇస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది. 2008కి ముందు ఉన్న సెలవు విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టినట్లు JNTU కొత్త వీసీ కిషన్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటనలో స్పష్టం చేశారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని విభాగాల్లోని అధికారులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాజా ప్రకటన ఈ నెల 22 నుంచే అమలులోకి రానుంది.

కాగా జేఎన్టీయూ హైదరాబాద్‌ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కొత్తదేమీ కాదు. 2008కి ముందు కూడా దీనిని అమలు చేశారు. అయితే 2008 తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ విధానాన్ని రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు దానిని పునరుద్ధరిస్తున్నట్లు యూనివర్సిటీ తన ప్రకటనలో పేర్కొంది. జేఎన్టీయే తాజా నిర్ణయంతో విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు