Delhi CM Rekha Gupta: 30 యేళ్ల నాటి జ్ఞాపకాలు.. రేఖ గుప్తా ఫొటో షేర్ చేసిన కాంగ్రెస్ నేత..! నెట్టింట వైరల్!
కాంగ్రెస్ నేత అల్కా లాంబా ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా షేర్ చేసిన ఓ పాత ఫోటో ప్రస్తుతం నెట్టిం తెగ వైరల్ అవుతుంది. ఇది 1995 నాటి ఫొటో. ఈ ఫొటోలో వేదికలపై రేఖా గుప్తాతో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్ధి సంఘం నాయకురాలిగా ఎన్నికైన సందర్భంగీ తీసుకున్న ఫొటో అది. ఈ విషయాన్ని అల్కా తన పోస్టులో ప్రస్తావిస్తూ.. ఢిల్లీకి నాలుగవ మహిళా ముఖ్యమంత్రిగా ఎంపికైనందుకు రేఖా గుప్తాకు అభినందనలు తెలిపారు..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఢిల్లీ పీఠం అధిరోహించనున్న కొత్త ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. కాలేజీ రోజుల్లో విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్న రేఖ గుప్తా నేడు ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో గురువారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అల్కా లాంబా బుధవారం (ఫిబ్రవరి 19) నూతన ముఖ్యమంత్రి రేఖ గుప్తాను అభినందిస్తూ సోషల్ మీడియాలో ఓ ఫొటో పంచుకున్నారు. విద్యార్ధి దశ నుంచే రేఖా గుప్తాలోని నాయకత్వ లక్షణాలను కొనియాడారు. ఆమె సారధ్యంలో మహిళల భద్రత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేత అల్కా లాంబా ఇన్‌స్టాగ్రామ్‌లో 1995 నాటి పాత ఫోటోను షేర్ చేశారు. అందులో వేదికలపై రేఖా గుప్తాతో కలిసి ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. నాడు NSUI నుంచి DUSU అధ్యక్షురాలిగా అల్కా, ABVP నుంచి జనరల్ సెక్రటరీగా రేఖా గుప్తాగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అల్కా తన పోస్టులో ప్రస్తావిస్తూ.. ఢిల్లీకి నాలుగవ మహిళా ముఖ్యమంత్రిగా ఎంపికైనందుకు రేఖా గుప్తాకు అభినందనలు తెలిపారు. ఆమె సారధ్యంలో యమునా తల్లి పరిశుభ్రంగా ఉంటుందని, కుమార్తెలుగా మేమంతా సురక్షితంగా ఉంటామని ఆశిస్తున్నట్లు తెలిపారు.
1995 की यह यादगार तस्वीर – जब मैंने और रेखा गुप्ता ने एक साथ शपथ ग्रहण की थी- मैंने @nsui से दिल्ली विश्वविद्यालय छात्र संघ (DUSU) #अध्यक्ष पद पर जीत हासिल की थी और रेखा ने #ABVP से #महासचिव पद पर जीत हासिल की थी- रेखा गुप्ता को बधाई और शुभकामनाएँ. दिल्ली को चौथी महिला… pic.twitter.com/csM1Rmwu9y
— Alka Lamba 🇮🇳 (@LambaAlka) February 19, 2025
ఎవరీ రేఖ గుప్తా?
1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కళాశాలలో చదువుతున్నప్పుడు రేఖ గుప్తా విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తరపున 1996-97 సంవత్సరానికి ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (DUSU) అధ్యక్షురాలిగా ఎన్నికైంది. నాడు విద్యార్థుల సమస్యలపై రేఖా గుప్త పోరాడిన విధానం ఎందరో మన్ననలను దక్కించుకుంది. 2007లో నార్త్ పితంపురా నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన రేఖా గుప్తా.. ఆ ప్రాంతంలో లైబ్రరీ, పార్క్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయడంలో విశేష కృషి చేశారు. ఇక ఈ ఏడాది (2025) ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్కా మాజీ ముఖ్యమంత్రి అతిషిపై పోటీ చేసి ఓడిపోయారు. షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖ గుప్తా, ఆప్ అభ్యర్థి బందన కుమారిపై 29 ఓట్ల తేడాతో గెలుపొందారు. రేఖ గుప్తా ప్రస్తుతం బీజేపీ ఏకైక మహిళా ముఖ్యమంత్రి మాత్రమే కాదు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత ఢిల్లీకి నాల్గవ మహిళా ముఖ్యమంత్రి కూడా ఆమెనే.
నేడు జరగనున్న ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 25 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది అక్కడ మోహరించారు. వీరితోపాటు భారీగా పారామిలిటరీ దళాలు కూడా మోహరించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అగ్ర బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరో 27 యేళ్ల తర్వాత ఢిల్లీ తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా కూడా బీజేపీ సభ్యులే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




