అయ్యో ఎంత ఘోరం.. 270 కిలోల రాడ్ మెడపై పడి.. వెయిట్ లిఫ్టర్ మృతి! వీడియో వైరల్
యువ క్రీడాకారిణి, జూనియర్ నేషనల్ గేమ్స్ బంగారు పతక విజేత యష్తికా ఆచార్య (17) జిమ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో 270 కిలోల రాడ్ మెడపై పడి మరణించింది. రాడ్ ఆమెపై పడటంతో మెడ విరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు నయా షహర్ ఎస్‌హెచ్‌ఓ విక్రమ్ తివారీ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది..

జైపూర్, ఫిబ్రవరి 20: రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జూనియర్ నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన యష్తిక ఆచార్య (17) దుర్మరణం చెందారు. మంగళవారం (ఫిబ్రవరి 18) జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు 270 కేజీల బరువైన రాడ్ ఆమె మెడపై పడింది. ఈ క్రమంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. అయితే జిమ్ సిబ్బంది ఆమెను వెంటనే దవాఖానకు తరలించగా.. అక్కడ పరిక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ మేరకు యువ క్రీడాకారిణి యష్తిక మృతి చెందిన విషయాన్ని నయా షహర్ ఎస్‌హెచ్‌ఓ విక్రమ్ తివారీ మీడియాకు వెల్లడించారు.
జిమ్‌లో ట్రైనర్ యష్తికతో 270 కిలోల రాడ్డును ఎత్తేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బరువును యష్తిక ఆపలేకపోయింది. దీంతో వెనక్కి వాలుకుంటూ వెళ్లి పడిపోయింది. ఈ క్రమంలో రాడ్ ఆమె మెడపై పడింది. దీంతో మెడ ఎమెకలు విరిగి ఆమె మృతి చెందింది. ఈ ఘటనలో యష్తిక కింద పడిపోతున్న సమయంలో ఆమె వెనుకే ఉన్న ట్రైనర్‌కు యష్తిక తల తగిలి అతడికీ గాయమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై యష్తిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని, పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని వారికి బుధవారం అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాగా యష్టిక చిన్న తనంలోనే ఎన్నో ఉన్నత శిఖరాలను సాధించింది. ఆమె మరణం క్రీడా ప్రపంచంలో అంతులేని విషాదాన్ని నింపింది.
खौफनाक VIDEO..
बीकानेर में 17 वर्षीय वेटलिफ्टर यष्टिका आचार्य की मौत, ट्रेनिंग के दौरान उठा रही थी 270 किलो वजन#Bikaner । #Rajasthan pic.twitter.com/2L9UAb1Jeu
— NDTV India (@ndtvindia) February 19, 2025
పవర్ లిఫ్టింగ్ అనేది అధిక బరువున్న రాడ్‌ను పైకి ఎత్తే క్రీడ. ఇందులో మూడు లిఫ్ట్‌లలో గరిష్ట బరువును పెంచడానికి మూడు ప్రయత్నాలు ఉంటాయి. స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్. ఈ క్రీడ ఒలింపిక్స్‌లో భాగం కాదు. అయితే క్రీడల్లో రాణించేందుకు యువత కఠోర శ్రమ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు ప్రాణాంతక ప్రమాదాలూ జరుగుతుంటాయి. గతంలో కూడా ఇలాంటివి పలుమార్లు జరిగాయి. క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్ హ్యూస్ 2014లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ సందర్భంగా సీన్ అబాట్ వేసిన బౌన్సర్ తగిలి మరణించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.