Heart Attack: డ్రైవింగ్ చేస్తుండగా ట్రక్ డ్రైవర్‌కు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
బుధవారం రాత్రి ట్రక్కు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో వరుస ప్రమాదాలు సంభవించాయి. షాపూర్ నుండి కలబురగి వైపు ప్రయాణిస్తున్న ట్రక్కు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో వాహనం అదుపు తప్పింది. దీంతో అది ఆటోలు, బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ కూరగాయల వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు..

కలబురగి, ఫిబ్రవరి 21: ఓ ట్రక్కు డ్రైవర్.. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఉన్నట్లుండి హార్ట్ ఎటాక్‌గు గురయ్యాడు. డ్రైవింగ్ చేస్తున్న సీట్లోనే కుప్పకూలి వాహనంపై అదుపు కోల్పోయాడు. కానీ ట్రక్కు రన్నింగ్‌లో ఉండటం వల్ల అది రోడ్డుపై నానాబీభత్సం సృష్టించింది. ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో రోడ్డుపై వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటక జిల్లాలోని కలబురగిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
కర్ణాటకలోని కలబురగిలో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. షాపూర్ నుంచి కలబురగి వైపు వెళ్తున్న ట్రక్కులోని డ్రైవర్ ఉన్నట్లుండి గుండె పోటుకు గురయ్యాడు. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలో ట్రక్కు రోడ్డుపై పలు వాహనాలను ఢీ కొట్టింది. పలు ఆటోలు, బైక్‌లు ఢీకొట్టి.. చివరికి ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో 32 ఏళ్ల కూరగాయల వ్యాపారి మహ్మద్ అలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు.. గాయాలపాలైన ట్రక్కు డ్రైవర్‌ను చికిత్స కోసం కలబురగి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జైవర్గి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.