School Holidays 2025: స్కూళ్లకు వరుస సెలవులు ప్రకటించిన సర్కార్.. ఉత్తర్వులు జారీ! ఏయే తేదీల్లోనంటే..
Telangana School Holidays 2025: స్కూళ్లకు ఈ నెల మొత్తం భారీగా సెలవులు వచ్చాయి. దసరా సెలవులు.. అయిపోగానే దీపావళి సెలవులు క్యూ కట్టాయి. అక్టోబర్ 20 (సోమవారం) దీపావళి పండగ వచ్చింది. ఈ రోజును అధికారిక సెలవుగా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటించాయి. అయితే దానికి ముందు రోజు ఆదివారం రావడంతో..

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు ఈ నెల మొత్తం భారీగా సెలవులు వచ్చాయి. దసరా సెలవులు.. అయిపోగానే దీపావళి సెలవులు క్యూ కట్టాయి. అక్టోబర్ 20 (సోమవారం) దీపావళి పండగ వచ్చింది. ఈ రోజును అధికారిక సెలవుగా రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటించాయి. అయితే దానికి ముందు రోజు ఆదివారం రావడంతో రెండు రోజులు వరుసగా సెలవులు వస్తున్నాయి. మరోవైపు శనివారం (అక్టోబర్ 18) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉండటంతో ఆ రోజు కూడా అన్ని స్కూళ్లకు సెలవు రానుంది. అక్టోబర్ 18న ధన త్రయోదశి సందర్భంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు మూడు రోజుల పండుగ సెలవులను కుటుంబంతో కలసి ఆనందంగా గడపనున్నారు.
ఇదిలా ఉంటే త్వరలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో ఈ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు రానుంది. ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. సెలవు రోజులు మినహా మిగిలిన పనిదినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.
అక్టోబర్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14 కౌంటింగ్ చేపట్టి, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




