UGC NET Paper Leak: యూజీసీ-నెట్‌ పరీక్ష రద్దుపై న్యాయవాది పిల్‌.. విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు

పేపర్‌ లీక్‌ కారణంగా యూజీసీ-నెట్‌ పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యా (పిల్‌)న్ని విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని న్యాయమూర్తులు..

UGC NET Paper Leak: యూజీసీ-నెట్‌ పరీక్ష రద్దుపై న్యాయవాది పిల్‌.. విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
UGC NET Paper Leak
Follow us

|

Updated on: Jul 30, 2024 | 4:08 PM

న్యూఢిల్లీ, జులై 30: పేపర్‌ లీక్‌ కారణంగా యూజీసీ-నెట్‌ పరీక్ష రద్దు చేసిన ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యా (పిల్‌)న్ని విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. పరీక్ష సమగ్రత దెబ్బతింటుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పిల్‌ని న్యాయవాది ఉజ్వల్‌గౌర్ దాఖలు చేయడం వల్లనే విచారణకు స్వీకరించడం లేదని ధర్మాసనం పేర్కొంది. బాధిత విద్యార్థులు దాఖలు చేయకుండా, ఓ న్యాయవాది నేరుగా పిల్‌ దాఖలు చేయడమే ఇందుకు కారణమని కోర్టు స్పష్టం చేసింది.

‘మీరెందుకు వచ్చారు? విద్యార్థులను స్వయంగా ఇక్కడకు రానివ్వండి. మీరు చట్టపరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించండి. ఇలాంటి వాటిని ప్రభావిత వ్యక్తులకు వదిలేయండని’ పిటిషనర్‌ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. పేపర్ లీక్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు యూజీసీ-నెట్ పరీక్ష ప్రతిపాదిత పునఃపరీక్షను నిలిపివేయాలని కోరుతూ న్యాయవాది ఉజ్వల్‌ గౌర్ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. కాగా ప్రశ్నపత్రం లీకైందన్న వార్తల నేపథ్యంలో యూజీసీ-నెట్‌ పరీక్షను జులై 19న కేంద్ర విద్యాశాఖ రద్దు చేస్తున్నట్లు కేంద్రం నిర్ణయించింది. పేపర్ లీక్‌లపై దర్యాప్తు కోసం కేసును సీబీఐకి బదిలీ చేసింది.

సీఏ ఫౌండేషన్‌ పరీక్షల్లో భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్

దేశవ్యాప్తంగా జూన్‌లో నిర్వహించిన సీఏ ఫౌండేషన్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గింది. కేవలం 14.96 శాతం మంది విద్యార్ధులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) సోమవారం ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 91,900 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 13,749 మంది ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 49,580 మంది పరీక్షలు రాస్తే 7,766 (15.66 శాతం), అమ్మాయిలు 42,320 మంది పరీక్షలకు హాజరైతే 5, 983 (14.14 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సీఏ పరీక్షలు ఎంతో కఠినంగా ఉంటాయి. ఈ పరీక్షల్లో 50 శాతం మార్కులు సాధిస్తేనే పాసైనట్లు పరిగణిస్తారు. గతేడాది దాదాపు 29.77శాతం మంది ఉత్తీర్ణత పొందారు. కాగా ప్రతి యేటా జూన్, డిసెంబరులో ఇంటర్‌ పూర్తయిన విద్యార్థులు సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు రాస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

తెలంగాణాలో అల్పపీడనం ప్రభావం.! మరో రెండ్రోజులు భారీ వర్షాలు..
తెలంగాణాలో అల్పపీడనం ప్రభావం.! మరో రెండ్రోజులు భారీ వర్షాలు..
'నా మనసంతా నీచుట్టే తిరుగుతోంది'..కుమారుడి పుట్టిన రోజున హార్దిక్
'నా మనసంతా నీచుట్టే తిరుగుతోంది'..కుమారుడి పుట్టిన రోజున హార్దిక్
UGC NET పరీక్ష రద్దుపై న్యాయవాది పిల్‌.. సుప్రీంకోర్టు చురకలు
UGC NET పరీక్ష రద్దుపై న్యాయవాది పిల్‌.. సుప్రీంకోర్టు చురకలు
అది ఆమె ఇష్టం.! గర్భం విషయంలో హైకోర్టు స్పష్టం.!
అది ఆమె ఇష్టం.! గర్భం విషయంలో హైకోర్టు స్పష్టం.!
వణుకుపుట్టించే పిల్ల దెయ్యం.. ఒంటరిగా చూస్తే ఇక అంతే సంగతులు..
వణుకుపుట్టించే పిల్ల దెయ్యం.. ఒంటరిగా చూస్తే ఇక అంతే సంగతులు..
ఆగస్ట్‌ 1 నుంచి ఫాస్టాగ్‌ కొత్త రూల్స్.. అదేంటో తెలుసా?
ఆగస్ట్‌ 1 నుంచి ఫాస్టాగ్‌ కొత్త రూల్స్.. అదేంటో తెలుసా?
ప్రాణం పోతున్నా పాలిస్తోంది.. ఆ తల్లి వానరానికే సాధ్యం.!
ప్రాణం పోతున్నా పాలిస్తోంది.. ఆ తల్లి వానరానికే సాధ్యం.!
ఏపీ డిగ్రీ 2024-25 ప్రవేశాల వెబ్ కౌన్సెలింగ్‌లో సందిగ్ధత
ఏపీ డిగ్రీ 2024-25 ప్రవేశాల వెబ్ కౌన్సెలింగ్‌లో సందిగ్ధత
ఓటీటీలో బిగ్ బాస్ నటుడి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో బిగ్ బాస్ నటుడి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..ఎందులో చూడొచ్చంటే?
డాక్టర్ వర్సెస్ నయన్.. ముదురుతున్న వివాదం..
డాక్టర్ వర్సెస్ నయన్.. ముదురుతున్న వివాదం..