Delhi IAS Coaching Centre Tragedy: ఢిల్లీ సివిల్స్‌ విద్యార్థులు మృతి.. ప్రమాదానికి ముందు జరిగిన దృశ్యాలు చూశారా? వీడియో వైరల్‌

ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్ర నగర్‌లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లో శనివారం అనూహ్యంగా వరదలు రావడంతో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా వరద నీరు పోటెత్తడంతో పలువురు ఐఏఎస్ అభ్యర్థులు బేస్‌మెట్‌లో చిక్కుకుపోయారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ బేస్‌మెట్‌లో అక్రమంగా..

Delhi IAS Coaching Centre Tragedy: ఢిల్లీ సివిల్స్‌ విద్యార్థులు మృతి.. ప్రమాదానికి ముందు జరిగిన దృశ్యాలు చూశారా? వీడియో వైరల్‌
Delhi IAS coaching centre Incident
Follow us

|

Updated on: Jul 29, 2024 | 5:15 PM

న్యూఢిల్లీ, జులై 29: ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్ర నగర్‌లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లో శనివారం అనూహ్యంగా వరదలు రావడంతో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా వరద నీరు పోటెత్తడంతో పలువురు ఐఏఎస్ అభ్యర్థులు బేస్‌మెట్‌లో చిక్కుకుపోయారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ బేస్‌మెట్‌లో అక్రమంగా లైబ్రరీని ఏర్పాటు చేయడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో విద్యార్ధులు నిరసనలు మిన్నంటాయి. ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతా చర్యలను పెంచారు. ఈ సంఘటన అనంతరం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఈ ప్రాంతంలోని 13 కోచింగ్ సెంటర్‌లను సీల్ చేసింది. ఈ కోచింగ్ సెంటర్లన్నీ నిబంధనలను ఉల్లంఘించి బేస్‌మెంట్‌ను ఇదే పద్ధతిలో దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించింది.

కాగా రావుస్‌ ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లోకి వరద నీరు ఎలా వచ్చిందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో కోచింగ్ సెంటర్ బయట రోడ్డుపై భారీగా వదర నీరు నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఇంతలో ఓ ఎస్‌యూవీ కారు వరద నీటిలో నుంచి వెళ్లడం కనిపిస్తుంది. దీంతో వరద నీళ్ల అలలు ఒక్కసారిగా ఉధృతంగా మారి కోచింగ్‌ సెంటర్‌ గేట్లలో నుంచి నీళ్లు దూసుకుపోడానికి దారి తీసింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే బేస్‌మెట్‌లోకి అకస్మాత్తుగా వరద పెరిగిపోయింది. బేస్‌మెట్‌లో డ్రైనేజీ సిస్టం లేకపోవడంతో భారీగా వరద నీరు అక్కడ నిలిచిపోయింది. భవనం లోపలికి వెళ్లడానికి, రావడానికి ఒకే బయోమెట్రిక్ లాక్ సిస్టమ్ ఉండటం, సంఘటన సమయంలో అది పనిచేయకపోవడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో విద్యార్థులు బయటకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో, లోపలే చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో విద్యార్ధులు కొందరు మెట్లపై చేరి ఉండటం వీడియోలో కనిపిస్తుంది. ప్రమాదం గురించి రాత్రి 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌కు సమాచారం అందడంతో.. అనంతరం కొద్ది సేపటికి వారు అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అప్పటి వరకు విద్యార్ధులంతా లోపలే చిక్కుకుపోయారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రాంతంలోని దాదాపు 70-75 శాతం లైబ్రరీలకు యాక్సెస్ బయోమెట్రిక్స్ ద్వారా నియంత్రిస్తున్నారని, ఈ లైబ్రరీలన్నీ బేస్‌మెట్‌లలోనే ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్ధులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్ధులు మృతి చెందడంపై ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో రావు ఐఏఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ యజమాని కూడా ఉన్నాడు. అలాగే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ గేట్లపైకి వరద నీరు పొంగడానికి కారణమైన SUV కారు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.