AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC Stenographer Jobs: ఇంటర్‌ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఏటా కేంద్ర శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,006 పోస్టులను భర్తీ చేయనున్నారు..

SSC Stenographer Jobs: ఇంటర్‌ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
SSC Stenographer Jobs
Srilakshmi C
|

Updated on: Jul 28, 2024 | 4:01 PM

Share

ఏటా కేంద్ర శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 2,006 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్‌ పాసైతే చాలు. అలాగే స్టెనోగ్రఫీలో నైపుణ్యం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు ఆగస్టు 01, 2024 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్ డి పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 17, 2024వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం..

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ విభాగం నుంచి 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇస్తారు. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్‌ విధానలో ఉంటాయి. ప్రశ్నాపత్రం కేవలం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. మొత్తం 2 గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ముఖ్యమైన తేదీల వివరాలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: జులై 26, 2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 17, 2024.
  • ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఆగస్టు 18, 2024.
  • దరఖాస్తు సవరణ తేదీలు: ఆగస్టు 27, 28 తేదీలు
  • కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష తేదీ: అక్టోబర్/ నవబర్‌, 2024.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.