AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRM యూనివర్సిటీ (AP)కి మరో అరుదైన గౌరవం.. ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం.

అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందిస్తోన్న ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. అకడమిక్‌ ఎక్సలెన్స్‌లో బెస్ట్‌ ఎమర్జింగ్‌ యూనివర్సిటీ విభాగంలో ఎస్‌ఆర్‌ఎమ్‌ ఆంధ్రప్రదేశ్‌ అవార్డు అందుకుంది. ఏప్రిల్‌ 3వ తేదీన ఢిల్లీలో జరిగిన...

Narender Vaitla
| Edited By: |

Updated on: Apr 04, 2023 | 6:14 PM

Share

అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందిస్తోన్న ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. అకడమిక్‌ ఎక్సలెన్స్‌లో బెస్ట్‌ ఎమర్జింగ్‌ యూనివర్సిటీ విభాగంలో ఎస్‌ఆర్‌ఎమ్‌ ఆంధ్రప్రదేశ్‌ అవార్డు అందుకుంది. ఏప్రిల్‌ 3వ తేదీన ఢిల్లీలో జరిగిన 13వ ఆసియా ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ 2023 కార్యక్రమంలో ఈ అవార్డును అందించారు. ఎస్‌ఆర్‌ఎమ్ యూనివర్సిటీ (ఏపీ) వైస్‌ ఛాన్సిలర్‌ ప్రొఫెసర్‌ మనోజ్‌ కే అరోరా అండ్‌ డైరెక్టర్‌ కమ్యూనికేషన్స్‌ పంకజ్‌ బెల్‌వారియర్‌ ఈ అవార్డను అందుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ రంజన్‌ సింగ్‌, పార్లమెంట్ సభ్యులు శ్రీ రమేష్‌ పొకిర్యాల్‌ చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ (ఏపీ) ప్రో-ఛాన్సల్‌ డాక్టర్‌ పి సత్యనారాయణ్‌ మాట్లాడుతూ.. ‘ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ-AP భారతదేశంలో ఉన్నత విద్యలో ముందంజలో ఉంది. ఆసియా ఎడ్యుకేషన్ సమ్మిట్ అండ్‌ అవార్డ్స్ 2023లో గుర్తింపు లభించడం, యూనివర్సిటీ సరైన మార్గంలో వెళుతోందనడానికి నిదర్శనం’ అని చెప్పుకొచ్చారు. ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ(ఏపీ) వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ మనోజ్‌ కె అరారో మాట్లాడుతూ.. ‘ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ అందుకుంటోన్న ఈ ప్రశంసలు.. విద్యా నాణ్యత, మార్గదర్శక టీచింగ్‌, పరిశోధనలకు ఇచ్చే ప్రాధాన్యతలను సూచిస్తున్నాయి’ అని చెప్పుకొచ్చారు. ఇక అరారో ఈ సందర్భంగా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంపై నిర్వహించిన ప్యానెల్‌ చర్చలో పాల్గొన్నారు. నేటి విద్యా వ్యవస్థలో ఎడ్యుకేషనల్ టెక్నాలజీకి ముఖ్యమైన పాత్ర ఉందన్న ఆయన.. విద్యాలయాలు, పరిశ్రల మధ్య సహకారం కోసం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

Srm

Prof. Manoj K Arora and Mr. Pankaj Belwariar receiving the award from Dr Raj Kumar Ranjan Singh, Minister of State for Education and External Affairs, and Ramesh Pokhriyal “Nishank”, Member of Parliament and former Minister of Education.

ఇదిలా ఉంటే.. విద్యా వ్యవస్థలలో నెలకొన్న సమస్యలపై దేశంలో ఉన్న అత్యున్నత వ్యక్తుల అభిప్రాయలను ఒకచోట పంచుకోవడానికి ఏర్పాటు చేసిందే ఆసియా ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌. ఇక ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ (ఏపీ) ప్రారంభమైన కేవలం ఐదున్నరేళ్లలోనే దేశ వ్యాప్తంగా తన సత్తా చాటింది. 2022 ఏడాదిలో నేచర్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్‌, పరిశోధన రంగాల్లో దేశంలోనే ఉత్తమ 3వ ప్రైవేటు యూనివర్సిటీగా గుర్తింపు సంపాదించుకుంది. అదే ఏడాదిలో.. ది ఎకనామిక్ టైమ్స్ బెస్ట్ బ్రాండ్స్ అవార్డ్, టాప్ ప్రామిసింగ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా (ఇండియా టుడే 2022), ఇన్నోవేటివ్ యూనివర్సిటీ ఆఫ్ ది ఇయర్ (అకడమిక్ ఇన్‌సైట్స్ మ్యాగజైన్) అవార్డులను దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..