AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBPS Exam Schedule 2025: ఐబీపీఎస్‌ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌… ఏ పరీక్ష ఎప్పుడంటే?

2025-26 సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌ (IBPS) రివైజ్‌డ్ జాబ్స్‌ క్యాలండర్‌ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్‌ ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం..

IBPS Exam Schedule 2025: ఐబీపీఎస్‌ పోస్టులకు రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌... ఏ పరీక్ష ఎప్పుడంటే?
IBPS Exam Schedule
Srilakshmi C
|

Updated on: Jun 19, 2025 | 7:20 AM

Share

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్ సెలక్షన్‌ (IBPS).. 2025-26 సంవత్సరానికి సంబంధించి రివైజ్‌డ్ జాబ్స్‌ క్యాలండర్‌ విడుదలైంది. ఇందులో ఆర్‌ఆర్‌బీ, పీవో, స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌, సీఎస్‌ఏ, మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ ఉద్యోగాల రాత పరీక్షల తేదీలను ఐబీపీఎస్‌ ప్రకటించింది. బ్యాంకింగ్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఈ తేదీల ప్రకారం తమ ప్రిపరేషన్‌ సాగిస్తే కొలువు దక్కించుకోవడం సలువు అవుతుంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. ఐబీపీఎస్ బ్యాంక్‌ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఆగస్టు 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు కొనసాగనున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షల తేదీను ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఐబీపీఎస్ 2025-26 రాత పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

RRB ఆఫీసర్ (రీజనల్ రూరల్ బ్యాంకులు) CRP PO, CRP SPL, CRP CSA పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయి. వీటిల్లో పీఓ పోస్టులకు ప్రిలిమ్స్ రాత పరీక్ష ఆగస్టు 17, 23, 24 తేదీల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష అక్టోబర్‌ 12, 2025వ తేదీన నిర్వహిస్తారు. స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టులకు ఆగస్టు 30న ప్రిలిమ్స్, నవంబర్‌ 9న మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్స్ పోస్టులకు ప్రిలిమ్స్‌ అక్టోబర్‌ 4, 5, 11 తేదీల్లో, మెయిన్స్‌కు నవంబర్‌ 29వ తేదీన జరుగుతుంది.

ఐబీపీఎస్ ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు నవంబర్‌ 22, 23 తేదీల్లో ప్రిలిమ్స్, డిసెంబర్‌ 28వ తేదీన మెయిన్స్‌ పరీక్షలు ఉంటాయి. ఆఫీసర్‌ స్టేల్ II అండ్‌ III పోస్టులకు మెయిన్స్ డిసెంబర్‌ 28 (ప్రిలిమ్స్‌ తేదీ ఖరారు చేయలేదు), ఆఫీసు అసిస్టెంట్స్ పోస్టులకు డిసెంబర్‌ 6, 7, 13, 14 తేదీల్లో ప్రిలిమ్స్, ఫిబ్రవరి 1, 2026న మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..