AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర విషాదం.. నదిలో కుప్పకూలిన వంతెన! నలుగురు మృతి.. 51 మందికి తీవ్ర గాయాలు

పుణెలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి ఉప్పొంగుతున్న ఇంద్రాణి నదిని చూడటానికి పాత వంతెన పైకి ఒక్కసారిగా 125 మంది గుమి గూడారు. అయితే ఉన్నట్టుండి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. దీంతో వంతెనపై ఉన్న పర్యాటకులు నదీ ప్రవాహంలో పడిపోయారు. ఇందులో నలుగురు మృతి చెందగా..

ఘోర విషాదం.. నదిలో కుప్పకూలిన వంతెన! నలుగురు మృతి.. 51 మందికి తీవ్ర గాయాలు
Pune Bridge Collapse
Srilakshmi C
|

Updated on: Jun 16, 2025 | 10:42 AM

Share

పూణె, జూన్‌ 16: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఇంద్రాణి నదిపై ఉన్న పురాతన వంతెన ఆదివారం (జూన్‌ 15) కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 51 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పుణె ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన పాత కట్టడం. ఇది శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడి కుండ్మాల గ్రామం సమీపంలోని నదిపైన ఉన్న కట్టడం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వంతెన కూలిపోయింది.

ఈ సంఘటన పూణే నుండి 30 కి.మీ దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన తలేగావ్‌లోని కుండ్ మాలా సమీపంలో జరిగింది. ఇది సహజ సింక్‌హోల్స్, లోయలు, ప్రత్యేకమైన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఉప్పొంగుతున్న నదిని చూడటానికి పాత వంతెన పైకి ఒక్కసారిగా 125 మంది గుమి గూడారు. అయితే వరద ప్రవాహం ధాటికి వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. వంతెన శిధిలావస్థకు చేరుకోవడంతో గతంలోనే వంతెనపై రాకపోకలు నిలిపివేయడం జరిగింది. అయితే వరద ప్రవాహాన్ని చూడడానికి బ్రిడ్జిపై ప్రజలు గుమిగూడటంతో ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, గ్రామస్తులు, విపత్తు సహాయ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కింద శిధిలాల కింద పడి మృతి చెందిన వారి డెడ్‌బాడీలను వెలికి తీశారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వంతెన కూలిన ఘటనపై దేవేంద్ర ఫడ్నవీస్ తో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రధాని, కేంద్ర హోం మంత్రి సంతాపం తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముగిసినట్లు జాతీయ విపత్తు సహాయ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) సోమవారం తెలిపింది. నలుగురు మృతి చెందినట్లు నిర్ధారించగా, ఇద్దరి మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!