IBPS PO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మీ స్కోర్‌ ఎంతో తెలుసుకోండి..

IBPS PO Result: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2021 ఫలితాలను ప్రకటించింది.

IBPS PO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మీ స్కోర్‌ ఎంతో తెలుసుకోండి..
Ibps Po
Follow us
uppula Raju

|

Updated on: Jan 05, 2022 | 7:27 PM

IBPS PO Result: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2021 ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్, ibps.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షను IBPS 04 డిసెంబర్ 2021 నుంచి 11 డిసెంబర్ 2021 వరకు నిర్వహించింది. దేశవ్యాప్తంగా వందలాది పరీక్షా కేంద్రాల్లో CBT విధానంలో పరీక్ష నిర్వహించారు. ఫలితాలు (ఈరోజు బుధవారం) 05 జనవరి 2022న విడుదల చేశారు.

PO, MT రిక్రూట్‌మెంట్ కోసం పరీక్ష IBPS కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కింద PO, మేనేజ్‌మెంట్ ట్రైనీ (IBPS MT) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు మెయిన్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. చివరకు ఎంపికైన తర్వాత అభ్యర్థులు ఖాళీ, కట్-ఆఫ్ ప్రకారం వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు పొందుతారు.

IBPS PO ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి.. 1. IBPS వెబ్‌సైట్ ibps.inకి వెళ్లండి. హోమ్ పేజీ ఎగువన ఉన్న CRP PO/MTs ప్రిలిమ్స్ ఫలితం 2021 లింక్ స్క్రోలింగ్‌పై క్లిక్ చేయండి. 2. IBPS ఆన్‌లైన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ IBPS PO రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. తర్వాత స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేసి లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి. 3. మీ ఫలితం తెరపై కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకొని భద్రంగా ఉంచుకోండి. 4. ఈ ఫలితాలు IBPS వెబ్‌సైట్‌లో జనవరి 11, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందుకే ముందుగానే మీ రిజల్ట్‌ కాపీని సేవ్ చేయడంతో పాటు, ప్రింట్ అవుట్ తీసుకోండి. తదుపరి నియామక ప్రక్రియలో ఇది మీకు అవసరమవుతుంది.

ఒకే ఒక్క రక్త పరీక్షతో క్యాన్సర్‌ని గుర్తించవచ్చు..! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు వెల్లడి..

MBBS Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలంటే..

AP Politics: తన కోపమే తన శత్రువు.. మరో YSRCP ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతల తిరుగుబావుటా..