AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: తన కోపమే తన శత్రువు.. మరో YSRCP ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతల తిరుగుబావుటా..

తనకోపమే తన శత్రువు అన్నది వేమన చెప్పిన మాట. రాజకీయాల్లో ఈ కోపం అస్సలు పనికిరాదు. కొన్ని సార్లు ఆ కోపమే.. నాయకుల కొంప ముంచుతుంది. లేని శత్రువులను తయారు చేస్తుంది.

AP Politics: తన కోపమే తన శత్రువు.. మరో YSRCP ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతల తిరుగుబావుటా..
Ysrcp
Janardhan Veluru
|

Updated on: Jan 05, 2022 | 7:18 PM

Share

Andhra Pradesh Politics: తనకోపమే తన శత్రువు అన్నది వేమన చెప్పిన మాట. రాజకీయాల్లో ఈ కోపం అస్సలు పనికిరాదు. కొన్ని సార్లు ఆ కోపమే.. నాయకుల కొంప ముంచుతుంది. లేని శత్రువులను తయారు చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ఎమ్మెల్యే విషయంలోనూ అదే జరుగుతోంది. సొంత పార్టీ నేతల నుంచే YSRCP ఎమ్మెల్యేకి అసమ్మతి సెగ మొదలైంది. తణుకులో మాస్‌ లీడర్‌గా పేరుతెచ్చుకున్నారు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్రావు. ఇప్పుడు లోకల్‌గా సొంత పార్టీ నుంచే ఆయనకు అసమ్మతి ఎదురవుతోంది. ZPTCగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు.. కోపమే మైనస్‌ పాయింట్‌గా మారిందంటున్నారు స్థానిక పార్టీ లీడర్స్.

ఇటీవల జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో.. వైసీపీ నియోజకవర్గ ప్రచారకమిటీ ఛైర్మన్ సాయిరాంరెడ్డిపై ఎమ్మెల్యే కారుమూరి కాస్త నోరుజారారు. ప్రజలకు మేలు చేయాలని చూస్తుంటే.. పార్టీలోని కొన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయంటూ.. పరోక్షంగా సాయిరాం రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జగన్ చేసే మంచి పనులను విపక్షాలను అడ్డుకుంటున్నట్లే.. నియోజకవర్గంలో మంచి పనులను కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఎమ్మెల్యే కారుమూరి వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన సాయిరాంరెడ్డి… తన పదవికి రాజీనామా చేశారు. తణుకు టౌన్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన సోదరుడు సత్తి సత్యనారాయణ రెడ్డి కూడా రిజైన్‌ చేశారు. వీరిద్దరూ రాజీనామా‌ చేయడం.. స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ వ్యవహారంపై వైసీపీ అధిష్టానం దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి.. ఇప్పటికే రిపోర్ట్‌ తెప్పించుకున్నట్టు తెలిసింది. ఇద్దరు నేతలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Tanuku Mla Karumuri

Tanuku MLA Karumuri

ఎమ్మెల్యే కారుమూరుకు వ్యతిరేకంగా సాయిరాంరెడ్డి వర్గం పోస్టులు పెట్టడంపైనా అధిష్టానం సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కారుమూరి కూడా ఆ స్థాయిలో రియాక్టవడం కరెక్టు కాదని నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మొన్నటికి మొన్న పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై సొంత పార్టీ నేతలు తిరుగుబావుటా చేయడం తెలిసిందే. ఇప్పుడు తణుకు ఎమ్మెల్యేపై పార్టీ నేతలు తిరుగుబాటు చేయడం వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది.

Also Read..

FYI: ఏపీ, తెలంగాణలో కొత్త ఓటర్ల జాబితా.. ఎంత మంది ఓటర్లు ఉన్నారంటే?

Minister KTR: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో  తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలుపుదాంః మంత్రి కేటీఆర్