Coronavirus: ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32,785 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 434 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇవాళ నాలుగు ఒమిక్రాన్ కేసులు ((Omicron cases in AP) వెలుగుచూశాయి. దీంతో ఏపీలో మెుత్తం కేసుల సంఖ్య 28కి చేరింది. యూఎస్‌ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. కాగా దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
#COVIDUpdates: 05/01/2022, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,75,481 పాజిటివ్ కేసు లకు గాను *20,59,134 మంది డిశ్చార్జ్ కాగా *14,499 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,848#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/oCv6S1fEcy
— ArogyaAndhra (@ArogyaAndhra) January 5, 2022
Also Read:
Civil Mains Exam: ఒమిక్రాన్ టెన్షన్.. సివిల్ మెయిన్స్ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ కీలక ప్రకటన..
AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫైనల్ ఎగ్జామ్స్‌లో 11 పేపర్లకు బదులు..