Covaxin: మీకు తెలుసా.. కోవాక్సిన్ టీకా తీసుకున్నవారు పేరాసెట్మాల్ టాబ్లెట్ వేసుకోనవసరం లేదు.. ఎందుకంటే..
రోనా ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. కొన్ని రోజులుగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే లక్షలాదిమంది టీనేజర్లకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేశారు.
Covaxin: కరోనా ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. కొన్ని రోజులుగా 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే లక్షలాదిమంది టీనేజర్లకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేశారు. మొదటి నుంచి టీకా తీసుకున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే పెరాసేట్మాల్ టాబ్లెట్స్ కూడా ఇస్తూ వస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి జ్వరం వచ్చే అవకాశం ఉన్నందున ఈ మందులను సిఫారసు చేస్తున్నారు. అయితే, కోవాక్సిన్ టీకా వేయిన్చుకున్నవారికి ఈ మాత్రలు వేసుకునే అవసరం ఉండదు. ఈ విషయాన్ని కోవాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. కంపెనీ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొంది. కోవాక్సిన్ వేసుకున్నవారు పెరాసేట్మాల్ వేసుకోవాల్సిన ఆవసరం లేదని కంపెనీ చెబుతోంది.
భారత్ బయోటెక్ తన ప్రకటనలో ఏమి చెప్పిందంటే..”కోవాక్సిన్ తీసుకున్నవారికి టీకా తీసుకున్న తరువాత పేరాసెట్మాల్ ట్యాబ్లేట్ వేసుకోమని సూచిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అయితే, కోవాక్సిన్ టీకా తీసుకున్నవారికి ఆ మాత్రల అవసరం ఉండదు. మేము జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ విషయంలో ఒక నిర్ధారణ వచ్చింది. ఈ క్లినికల్ ట్రయల్స్ 30 వేల మందిపై జరిపాము. అందులో కేవలం 10 నుంచి 20 శాతం మందికి మాత్రమే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. అవికూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇవి ఒకటి రెండురోజుల్లో సాధారణ స్థితికి వచ్చేస్తాయి. దానికి ఏ విధమైన మండులతోనూ పనిలేదు.”
ఒకవేళ ఏదైనా మందులు వాడాల్సిన పరిస్థితి ఉంది అని మీరు అనుకుంటే.. వైద్యుడిని సంప్రదించాలని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా పేరాసెట్మాల్ కొన్ని ఇతర కోవిడ్ 19 వ్యాక్సిన్ లకు మాత్రమె సిఫారసు చేస్తున్నారనీ.. కోవాక్సిన్ కు కాదనీ కంపెనీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
భారత్ బయోటెక్ విడుదల చేసిన ప్రకటన ఇదే.
ఇవి కూడా చదవండి: Viral Photo: చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!
Muthoot Finance: ముత్తూట్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ సేవలు బంద్..!