Muthoot Finance: ముత్తూట్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ సేవలు బంద్‌..!

Muthoot Finance: బంగారంపై సులభంగా రుణాలు పొందడం, తక్కు వడ్డీ రేటు, ఎక్కువ మొత్తంలో డబ్బులు రావాలంటే చాలా మంది ముత్తూట్‌ ఫైనాన్స్‌ను..

Muthoot Finance: ముత్తూట్‌పై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆ సేవలు బంద్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 05, 2022 | 1:48 PM

Muthoot Finance: బంగారంపై సులభంగా రుణాలు పొందడం, తక్కు వడ్డీ రేటు, ఎక్కువ మొత్తంలో డబ్బులు రావాలంటే చాలా మంది ముత్తూట్‌ ఫైనాన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ ఫైనాన్స్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు కంపెనీల సర్టిఫికేట్‌ ఆఫ్‌ అథరైజేషన్‌ (CoA)ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్లుగా వ్యవహరించే ముత్తూట్‌ వెహికల్‌ అండ్‌ అసెట్‌ ఫైనాన్స్‌, ఈకో ఇండియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనే రెండు కంపెనీలు ఉన్నాయి. సరైన నిబంధనలు పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. సీఓఏ రద్దు వల్ల ఇక నుంచి రెండు కంపెనీలు ప్రిపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ జారీ, నిర్వహణ సేవలు అందించలేవు.

వినియోగదారులు ముత్తూట్‌ వెహికల్‌ అండ్‌ అసెట్‌ ఫైనాన్స్‌, ఈకో ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించి ఏమైనా క్లెయిమ్‌ చేసుకోవాలంటే మూడు సంవత్సరాల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. సర్టిఫికేట్‌ ఆఫ్‌ అథరైజేషన్‌ రద్దు తర్వాత.. ఈ రెండు కూడా సర్వీసుల నిర్వహణ కోల్పోయింది. అయితే ముత్తూట్‌ వెహికల్‌ అండ్‌ అసెట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (MVFL), ముత్తూట్‌ గ్రూప్‌ వాహనం, అసెట్‌ ఫైనాన్స్‌ విభాగం కంపెనీలు 1992లో ముత్తూట్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌గా విలీనం అయ్యాయి. 2008లో కంపెనీ అందించే ఆర్థిక సేవలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీ పేరు అధికారికంగా ముత్తూట్‌ వెహికల్‌ అండ్‌ అసెట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌గా మార్చబడింది.

ఏకో ఇండియా ఫైనాన్స్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనేది 2007లో స్థాపించబడిన ఒక ప్రైవేటు సంస్థ. ఇది ప్రభుత్యేతర కంపెనీగా గుర్తించబడింది. ఏకో ఇండియా ఫైనాన్స్‌ ఇప్పటి వరకు 50 మిలియన్లకుపైగా కస్టమర్లకు సేవలందిస్తోంది. 1,50,000 మంది కస్టమర్ల వ్యాపార నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉందని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్ సిస్టమ్స్‌ యాక్ట్‌ 2007 ప్రకారం నిబంధనలు పాటించడం లేదని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

Railway Station: కొన్ని రైల్వే స్టేషన్‌లను సెంట్రల్‌, టెర్మినల్‌ అని పేర్లతో ఎందుకు పిలుస్తారు..?

Car Loan: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా..? లోన్‌ కూడా తీసుకోవచ్చు.. గుర్తించుకోవాల్సిన విషయాలు..!

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు