AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FASTAG: ఫాస్టాగ్‌ అకౌంట్ మూసివేయాలంటే ఎలా..? మొత్తం ప్రక్రియ తెలుసుకోండి..

FASTag: మీరు కారును అమ్మేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా

FASTAG: ఫాస్టాగ్‌ అకౌంట్ మూసివేయాలంటే ఎలా..? మొత్తం ప్రక్రియ తెలుసుకోండి..
Fastag
uppula Raju
|

Updated on: Jan 05, 2022 | 4:35 PM

Share

FASTAG: మీరు కారును అమ్మేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాను కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రారంభించిన కొత్త ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID)ని ఉపయోగించి మీ ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ ఖాతా నుంచి నేరుగా టోల్ చెల్లింపులు చేయడానికి ఫాస్టాగ్‌ ఉపయోగపడుతుంది. ఫాస్ట్‌ట్యాగ్‌ని బ్యాంకుల నుంచి, సేవా కేంద్రాల నుంచి కొనుగోలు చేస్తారు. మీ కారును అమ్మడం అంటే కొన్న వ్యక్తి మీ ఫాస్ట్‌ట్యాగ్ అన్ని ప్రయోజనాలను పొందుతాడని అర్థం. అప్పుడు మీరు ఫాస్టాగ్‌ ఖాతా మూసివేయాల్సి ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.

ఫాస్ట్‌ట్యాగ్‌ రద్దు ఎందుకు ముఖ్యం? మీరు మీ వాహనాన్ని విక్రయించి దాని పత్రాలను వేరొకరి పేరుకు బదిలీ చేసినట్లయితే మీరు మీ పాత ఫాస్ట్‌ట్యాగ్‌ని నిలిపివేయాలి. లేకపోతే ఆ వ్యక్తి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించుకోవచ్చు. మీ ఖాతా నుంచి చెల్లింపులు చేయవచ్చు. అందుకే మీరు మీ FASTag ఖాతాను మూసివేయాలి. అప్పుడే మీ కారు కొత్త యజమాని FASTag కొత్త ఖాతా కోసం అప్లై చేసుకుంటారు.

FASTag ఎలా మూసివేయాలి? ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేసే అధికారం కలిగి ఉన్న అనేక సేవా కేంద్రాలు ఉన్నాయి. వారందరికీ ఫాస్ట్‌ట్యాగ్‌కి లింక్ చేయబడిన ఖాతాను నిష్క్రియం చేయడానికి లేదా మూసివేయడానికి వివిధ మార్గాలు ఉంటాయి. ఫాస్ట్‌ట్యాగ్‌కి సంబంధించిన ఏదైనా ఫిర్యాదును పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన హెల్ప్‌లైన్ నంబర్ 1033 అందుబాటులో ఉంటుంది.

ఫాస్టాగ్‌ని మూసివేయడానికి కొన్ని పద్దతులు..

1. NHAI (IHMCL) – కస్టమర్ సపోర్ట్ నంబర్ 1033కి కాల్ చేయండి. మీకు క్లోజర్/డియాక్టివేషన్ ప్రాసెస్ గురించి చెబుతారు. 2. ICICI బ్యాంక్ – 18002100104 నంబర్‌కు కాల్ చేయండి. ఫాస్టాగ్‌ మూసివేయడం ఎలాగో చెప్పమని అడగండి. 3. PayTM – 18001204210కి కాల్ చేయండి లేదా Paytm యాప్‌కి లాగిన్ కండి. 24 x 7 హెల్ప్ డెస్క్ విభాగానికి వెళ్లండి. సమస్య రకాన్ని ఎంచుకుని పరిష్కరించమని అడగండి. 4. యాక్సిస్ బ్యాంక్ – 18004198585కు కాల్ చేయండి లేదా మీ రిజిస్టర్డ్ ఈ మెయిల్ ఐడిని ఉపయోగించి etc.management@axisbank.comకి మెయిల్ పంపించండి. 5. HDFC బ్యాంక్ – 18001201243కి కాల్ చేయండి లేదా మీ ఆధారాలతో ఫాస్ట్‌ట్యాగ్ పోర్టల్‌కి లాగిన్ కండి. సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్‌ను ఎంచుకుని జనరేట్ సర్వీస్ రిక్వెస్ట్‌పై క్లిక్ చేయండి. ఆపై క్లోజ్‌ అభ్యర్థనను ఎంచుకోండి.

Covid Guidelines: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ

Mahesh Babu : పుష్ప సినిమా పై మహేష్ బాబు ట్వీట్.. అల్లు అర్జున్ రిప్ల్ ఏమిచ్చాడంటే..

Spy pigeon: దేశంలో పావురాళ్ల కలకలం.. తాజాగా ఖమ్మం జిల్లాలో.. అసలు కథేంటి..?