Spy pigeon: దేశంలో పావురాళ్ల కలకలం.. తాజాగా ఖమ్మం జిల్లాలో.. అసలు కథేంటి..?
దేశంలో పావురాళ్ల కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న ఒడిశా... ఇవాళ ప్రకాశం జిల్లా చీమకుర్తి, కడప.. తాజాగా ఖమ్మం జిల్లాలో కాళ్లకు ట్యాగ్ ఉన్న పావురాలు టెన్షన్ రేపాయి.
దేశంలో పావురాళ్ల కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న ఒడిశా… ఇవాళ ప్రకాశం జిల్లా చీమకుర్తి, కడప.. తాజాగా ఖమ్మం జిల్లాలో కాళ్లకు ట్యాగ్ ఉన్న పావురాలు టెన్షన్ రేపాయి. ప్రేమకు చిహ్నాలైన ఈ పావురాళ్లతో దేశానికి ముప్పు పొంచి ఉందా..? డ్రాగన్ కంట్రీ ఏమైనా వ్యూహ రచన చేస్తోందా..? వీటి వెనుక ఉగ్ర కుట్ర దాగుందా..? ఇవి గూఢాచారి పావురాళ్లా..? ఈ పిజియోన్స్ వెనుక మిస్టరీ ఏంటి..? అన్నది తేలాల్సి ఉంది.
ఇక ఇవాళ ప్రకాశం జిల్లా చీమకుర్తిలోనూ అదే తరహా పావురం స్థానికులకు చిక్కింది. ఆ పిజియోన్ కాలికి ఎల్లో కలర్ ట్యాగ్ ఉండటంపై పలు సందేహాలు కలుగుతున్నాయి. వారం రోజులుగా ఈ పావురం కనిపిస్తోందని..ఉన్నతాధికారులకు ఈ సమాచారం అందించామంటున్నారు స్థానిక పోలీసులు. ఈ ఘటనపై చర్చ జరుగుతుండగానే ఖమ్మం జిల్లాలో ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం దమ్మయిగుడెంలో రైతుకు ఓ పావురం కంటపడింది. దానికి చైనా ట్యాగ్ ఉండటంతో దాన్ని బంధించారు.
అసలే సరిహద్దులో చైనా కుట్రలు పన్నుతున్న వేళ.. ఇవి ఏ దేశపు పావురాలు? ఈ విదేశీ పావురాలకు ఇక్కడేం పని? వీటి కాలికున్న ట్యాగ్ లైన్లు ఏం చెబుతున్నాయ్? ఇవేమైనా గూఢాచారి పావురాళ్లా..? ఏంటీ లెక్క అని ఆరా తీస్తున్నారు పోలీసులు. వీటి వెనుక కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఒడిశాలో క్షిపణి ప్రయోగాలు..వైజాగ్‌లో నావెల్ బేస్..ఇక ఇటు చీమకుర్తిలో గ్రానైట్ ఇండస్ట్రీ..ఇలాంటి ఇంపార్టెస్ ప్లేసెస్‌పై నిఘా పెట్టారా..? అని ఆరా తీస్తున్నారు.
ఒక వేళ ఇవి చైనా పావురాళ్లయితే.. డ్రాగన్ కంట్రీ ఎలాంటి సంకేతం పంపుతోంది? అల్యూమినియం ట్యాగ్ లో ఏదైనా చైనా మార్క్ స్కెచ్ దాగుందా? పోలీసు విచారణలో ఏం తేలనుంది? అన్నది ఉత్కంఠ రేపుతోంది.