Bandi Sanjay: బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట.. రిమాండ్ రద్దు.. వెంటనే విడుదలకు ఆదేశం
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు బుధవారం ఆదేశించింది.
Telangana BJP Chief Bandi Sanjay Kumar: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వెంటనే విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు ఆదేశించింది. తనపై దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌ను క్యాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ తరపు న్యాయవాది మంగళవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. బండి సంజయ్ రిమాండ్‌ను రద్దు చేసింది. వెంటనే సంజయ్‌ను విడుదల చేయాలని జైళ్ల శాఖ డీజీకి హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.