Minister KTR: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో  తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలుపుదాంః మంత్రి కేటీఆర్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు.

Minister KTR: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో  తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలుపుదాంః మంత్రి కేటీఆర్
Minister Ktr
Follow us

|

Updated on: Jan 05, 2022 | 6:50 PM

Minister KTR on Ease of Doing Business Ranking: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సహా వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల ప్రక్రియపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని సాధించేందుకు వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియ పైన దిశానిర్దేశం చేశారు.

గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. మార్గదర్శనం, ప్రభుత్వ శాఖాధిపతుల కృషివలన గతంలో అగ్రస్థానంలో నిలిచామని, ఈసారి ర్యాంకుల్లో సైతం అగ్రస్థానంలో నిలిచే కృషి చేద్దామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాల్లో 100% సంస్కరణలు, చర్యలు పూర్తయ్యాయని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు. ఈసారి రానున్న ర్యాంకులను నిర్దేశించే యూజర్ ఫీడ్బ్యాక్ అత్యంత కీలకమైన అంశమని, ఈ విషయంలో వివిధ శాఖలకు సంబంధించిన సేవలు పొందుతున్న పారిశ్రామిక వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుందని పరిశ్రమల శాఖ అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులకు వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఇక్కడి అధికారులు చొరవ వలన రాష్ట్రానికి అనేక పెట్టుబడులు విజయవంతంగా వస్తున్నాయని, తద్వారా ఇక్కడ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దక్కించుకోవడం ఎంతో దోహదకారిగా నిలిచిందన్నారు. ఈసారి సైతం అగ్రస్థానం సాధించుకునేందుకు మనమంతా కలిసి ప్రయత్నం చేద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల కోసం పనిచేయడం కేవలం పరిశ్రమల శాఖ కోసం పని చేయడం మాత్రమే కాదన్నారు, తమ తమ శాఖలు విభాగాలను బలోపేతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అని కేటీఆర్ అన్నారు. తమ విభాగాలను బలోపేతం చేసుకుంటూనే మనమంతా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం పని చేస్తున్నామనే స్ఫూర్తితో పని చేస్తే ర్యాంకుల్లో మరోసారి అగ్ర స్థానం దక్కడం ఖాయమని ఈ దిశగా పని చేద్దామని కేటీఆర్ దిశానిర్ధేశం చేశారు.

వివిధ శాఖలకు సంబంధించిన 300కు పైగా సంస్కరణలు, చర్యలు పూర్తి అయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఆయా శాఖల వారీగా మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో లో వివిధ శాఖల విభాగాల అధిపతులు పాల్గొన్నారు. Read Also…. Telangana Bandh: 317 జీవోను పునఃసమీక్షించాలని ఈ నెల 10న తెలంగాణ బంద్‌.. పిలుపునిచ్చిన బీజేపీ