Car Loan: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా..? లోన్‌ కూడా తీసుకోవచ్చు.. గుర్తించుకోవాల్సిన విషయాలు..!

Car Loan: ప్రస్తుతం పాత కార్లకు డిమాండ్‌ బాగానే ఉంది. కొత్త కార్లను కొనుగోలు చేసే స్థోమత లేనివారు సెకండ్‌ హ్యాండ్‌ కార్లపై మొగ్గు చూపుతుంటారు...

Car Loan: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా..? లోన్‌ కూడా తీసుకోవచ్చు.. గుర్తించుకోవాల్సిన విషయాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 05, 2022 | 8:55 AM

Car Loan: ప్రస్తుతం పాత కార్లకు డిమాండ్‌ బాగానే ఉంది. కొత్త కార్లను కొనుగోలు చేసే స్థోమత లేనివారు సెకండ్‌ హ్యాండ్‌ కార్లపై మొగ్గు చూపుతుంటారు. ఇక 2020 సంవత్సరంలో పాత కార్ల విక్రయాల మార్కెట్‌ విలువ 27 మిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2026 నాటికి ఇది ఏటా 15 శాతం వృద్ధితో 50 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఓ ప్రముఖ సంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌ ఈ-కామర్స్‌ కంపెనీ కార్స్‌24తో జతకట్టింది. పాత కార్లకు ఫైనాన్స్‌ ఇచ్చేందుకు రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే భారత్‌లో ఇప్పటి వరకు పాత కార్లపై రుణాలు తీసుకునే వారి వాటా 15 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధిక శాతం మంది సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోలుకు కూడా రుణాలు విషయం పెద్దగా తెలిసి ఉండదు.

లోన్‌ తీసుకునే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు: పాత కార్లపై రుణం తీసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవడం ముఖ్యం. అర్హత, రుణం, కాలపరిమితి, వడ్డీ రేట్లు, ఈఎంఐ వంటి విషయాలను ముందే తెలుసుకోవడం ఉత్తమం. కార్ల మోడల్‌, కారు షోరూమ్‌ నుంచి బయటకు వచ్చిన కారు పనితీరు, తదితర విషయాలు లోన్‌ మంజూరుపై ప్రభావం చూపుతాయి. బ్యాంకులు గానీ, ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు గానీ కొత్త కార్లకు ఇచ్చే రుణాల కంటే సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు అధికంగానే ఉంటుంది. కొత్త కార్లకు గ్యారంటీ ఉంటాయి. కానీ పాత కార్లకు ఎలాంటి గ్యారంటి ఉండదు.70-90 శాతం మాత్రమే రుణంగా ఇస్తాయి. అదే కొత్త కార్లకు ఎక్కువ మొత్తంలో రుణం అందిస్తుంటాయి. సాధారణంగా పాత కార్లు కొనే ధర కంటే ఫైనాన్స్‌ కంపెనీలు ధర తక్కువ కట్టి రుణాలు అందిస్తుంటాయి. అలాగే కాలపరిమితి కూడా తక్కువగానే ఉంటుంది. ఒక వేళ మీరు ఐదేళ్ల కిందటి కారును కొనుగోలు చేస్తే రుణ కాలపరిమితి 3-5 సంవత్సరాలు మాత్రమే ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అదే మంచి సంస్థల నుంచి పాత కారును కొనుగోలు చేసినట్లయితే త్వరగా రుణం మంజూరయ్య అవకాశం ఉంటుంది. అదే తెలిసిన వాళ్ల వద్ద నుంచి గానీ, ఇతరుల నుంచి పాత కారు కొనుగోలు చేస్తే రుణం మంజూరు కావడం కొంత కష్టమే. అయితే కొందరు కొన్ని కార్లపై రుణాలు తీసుకుంటారు. అలాంటి కార్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే వారు అప్పటికే రుణం తీసుకుంటారు కాబ్టటి దానిపై రుణ వాయిదాలు ఉండవచ్చు. లేదా సరిగ్గా రుణం వాయిదాలను చెల్లించనట్లయి అలాంటి కార్లను ఏ సంస్థలు కూడా రుణం అందించవు.

అసలు పాత కార్లను ఎవరు కొనుగోలు చేయాలి..

ద్విచక్ర వాహనాన్ని వినియోగిస్తూ కారు కొనాలని భావించేవారు పాత కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపవచ్చు. వ్యాపారస్తులు రోజువారీ పనుల కోసం కూడా పాత కార్లను కొంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే 5-7 సంతవ్సరాల కాంటే ఎక్కువ కాలం ఉపయోగించుకోవాలని భావించే వాళ్లు పాత కార్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. కొత్త కారు కొనుగోలు చేసిన ఏడాదికే దాని విలువ దాదాపు 40 శాతం వరకు తగ్గుతుంది. కార్ల పనితీరు, కారు వాడే విధానం బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. సింగిల్ హ్యాండ్‌ కారుకు మంచి రేటు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కొత్త కారు తీసుకున్న ఏడాది,రెండేళ్లకే కారు రూపు రేఖలు మారితే తక్కువ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Post office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను మినహాయింపు పొందవచ్చు.. పూర్తి వివరాలు..!

Nominee: వివిధ స్కీమ్‌లు, బ్యాంకు ఖాతాల్లో నామినీ పేరును ఎందుకు చేర్చాలి.. లేనట్లయితే ఏమవుతుంది.. పూర్తి వివరాలు

హాస్టల్ భవనంపై నుంచి దూకేసిన ఇంటర్ విద్యార్థిని.. ఎక్కడంటే
హాస్టల్ భవనంపై నుంచి దూకేసిన ఇంటర్ విద్యార్థిని.. ఎక్కడంటే
స్ట్రీట్ చాయ్ వాలా ఇప్పుడు వ్యాపారవేత్తగా మారిన పాక్ చాయ్ వాలా
స్ట్రీట్ చాయ్ వాలా ఇప్పుడు వ్యాపారవేత్తగా మారిన పాక్ చాయ్ వాలా
ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? హీరో టు విలన్ ఏదైనా అదరగొట్టేస్తాడు
ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? హీరో టు విలన్ ఏదైనా అదరగొట్టేస్తాడు
విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు.. ఈసీ ప్రకటన
విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు.. ఈసీ ప్రకటన
ఐపీఎల్ వేలంలోకి అడుగు పెట్టిన లెజెండ్ ప్లేయర్ల కుమారులు
ఐపీఎల్ వేలంలోకి అడుగు పెట్టిన లెజెండ్ ప్లేయర్ల కుమారులు
రూ.1.8 లక్షల కోట్లు.. భారత్‌లో ఫెస్టివల్ సీజన్ అంటే అట్లుంటది మరి
రూ.1.8 లక్షల కోట్లు.. భారత్‌లో ఫెస్టివల్ సీజన్ అంటే అట్లుంటది మరి
వీటిని మర్చిపోకుండా అప్పుడప్పుడైనా తీసుకుంటే.. బోలెడన్ని ఉపయోగాలు
వీటిని మర్చిపోకుండా అప్పుడప్పుడైనా తీసుకుంటే.. బోలెడన్ని ఉపయోగాలు
ముట్టుకుంటే మాసిపోయే ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ముట్టుకుంటే మాసిపోయే ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ఆర్‌సీబీ రిటైన్ చేయలే.. ట్రిఫుల్ సెంచరీతో ఊరమాస్ ఇన్నింగ్స్
ఆర్‌సీబీ రిటైన్ చేయలే.. ట్రిఫుల్ సెంచరీతో ఊరమాస్ ఇన్నింగ్స్
తలకు 40 కుట్లు.. ఒళ్లంతా గాయాలు.. ప్రేమను కాదన్నదని...
తలకు 40 కుట్లు.. ఒళ్లంతా గాయాలు.. ప్రేమను కాదన్నదని...
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.