Railway Station: కొన్ని రైల్వే స్టేషన్‌లను సెంట్రల్, టెర్మినల్ అని పేర్లతో ఎందుకు పిలుస్తారు..?
Railway Station: మీరు రైలులో ప్రయాణించినప్పుడు చాలా స్టేషన్లు వస్తుంటాయి. ఆ స్టేషన్‌లకు కొన్ని పేర్లు ఉంటాయి. స్టేషన్ పేరు పక్కన సెంట్రల్ రైల్వే స్టేషన్ అని, టెర్మినల్ ..
Railway Station: మీరు రైలులో ప్రయాణించినప్పుడు చాలా స్టేషన్లు వస్తుంటాయి. ఆ స్టేషన్‌లకు కొన్ని పేర్లు ఉంటాయి. స్టేషన్ పేరు పక్కన సెంట్రల్ రైల్వే స్టేషన్ అని, టెర్మినల్ స్టేషన్ పేరు వినే ఉంటారు. అలాగే జంక్షన్ ఏదైనా దాని ముందు ఈ టెర్మినల్, సెంట్రల్ అనే పేరు ఉంటుంది. ఇంతకు ఈ పేర్లు ఎందుకుంటాయి.? ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్ మరియు కాన్పూర్ సెంట్రల్. స్టేషన్ పేర్లకు ఇలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసుకుందాం.
1 / 4
సెంట్రల్ స్టేషన్ అంటే ఆ నగరం యొక్క అతి ముఖ్యమైన స్టేషన్ అని అర్థం. సెంట్రల్ స్టేషన్ నగరంలో అత్యంత ముఖ్యమైన రద్దీగా ఉండే స్టేషన్. ఈ స్టేషన్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అందుకే ఇలాంటి పెద్ద స్టేషన్‌లకు ముందు సెంట్రల్ అని పేరు ఉంటుంది. అంతేకాదు అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌లను కూడా ఇలా సెంట్రల్ పేరుతో గుర్తిస్తుంది రైల్వే శాఖ.
2 / 4
రద్దీగా ఎక్కువగా ఉన్న స్టేషన్‌లకు ఈ సెంట్రల్ అని పేరు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక ఢిల్లీలో కూడా చాలా స్టేషన్లు ఉంటాయి. న్యూఢిల్లీ స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే స్టేషన్. ఢిల్లీలో ఒక్క సెంట్రల్ స్టేషన్ కూడా లేదు. రైలు స్టేషన్, రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల రద్దీ అన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆస్టేషన్‌ను సెంట్రల్ అని పేరుతో సంబోధిస్తారు.