AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. భారీగా పెరిగిన కొత్త కేసులు.. 24 గంటల్లో ఎంతమంది ఈ మహమ్మారి బారిన పడ్డారంటే..

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. రోజువారీ కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా రెండోరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవ్వడం రాష్ట్రంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా గడిచిన 24 గంటల్లో 42, 531 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు

Coronavirus: తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. భారీగా పెరిగిన కొత్త కేసులు.. 24 గంటల్లో ఎంతమంది ఈ మహమ్మారి బారిన పడ్డారంటే..
Basha Shek
|

Updated on: Jan 05, 2022 | 8:16 PM

Share

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. రోజువారీ కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా రెండోరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవ్వడం రాష్ట్రంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా గడిచిన 24 గంటల్లో 42, 531 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1520 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,85, 543కి చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4, 034కు చేరింది. గడిచిన 24 గంటల్లో 209 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6168 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఒమిక్రాన్‌ కేసులు ఎన్నంటే.. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా ఎలాంటి ఒమిక్రాన్‌ కేసులు నమోదుకాలేదని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 13652 మంది ప్రయాణికులకు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో 207 మందికి కరోనా సోకిందని నిర్ధారితమైంది. ఇక ఒమిక్రాన్‌ నిర్ధారిత పరీక్షల కోసం వీటిని జినోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కి పంపగా.. వారిలో 162 మందికి ఒమిక్రాన్‌ సోకిందని తేలింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్‌ బాధితుల్లో 43 మంది కోలుకున్నారు. కాగా మరో 68మంది ఫలితాలు రావాల్సి ఉందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

Also Read:

Coronavirus: ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

MBBS Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలంటే..

Civil Mains Exam: ఒమిక్రాన్‌ టెన్షన్‌.. సివిల్‌ మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీ కీలక ప్రకటన..