AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Board Exams 2022: బోర్డ్‌ ఎగ్జామ్ ముందు వ్యాక్సిన్‌ తప్పనిసరి.. నోటీసు జారీచేసిన ICSE

Board Exams 2022: బోర్డు ఎగ్జామ్స్‌ మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో

Board Exams 2022: బోర్డ్‌ ఎగ్జామ్ ముందు వ్యాక్సిన్‌ తప్పనిసరి.. నోటీసు జారీచేసిన ICSE
Child Vaccine
uppula Raju
|

Updated on: Jan 05, 2022 | 7:44 PM

Share

Board Exams 2022: బోర్డు ఎగ్జామ్స్‌ మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కోవిడ్ టీకాలు వేయడం ప్రారంభించింది. ఈ దశలో ICSE బోర్డు కూడా ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. బోర్డు ఎగ్జామ్స్‌ రాసే విద్యార్థులందరు తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలని సూచించింది.

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (CISCE) తన వెబ్‌సైట్ cisce.orgలో నోటీసును జారీ చేసింది. 10వ తరగతి అంటే ICSE (ICSE బోర్డ్ ఎగ్జామ్ 2022) 12వ అంటే ISC ఎగ్జామినేషన్ 2022 (ISC ఎగ్జామ్ 2022) విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి వారు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. అప్పుడే వారిని బోర్డ్ పరీక్షలను అనుమతిస్తామని పేర్కొంది. ఐసిఎస్‌ఈ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌, సెక్రటరీ గ్యారీ అరథూన్ ఐసిఎస్‌ఈ జారీ చేసిన ఈ నోటీసులో ’15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు తల్లిదండ్రులకు టీకా వేయించాలని అన్ని పాఠశాలల ప్రిన్సిపాల్‌లకు సూచించింది.

జనవరి 3 నుంచి పిల్లలకు టీకాలు పిల్లల వ్యాక్సిన్‌కు సంబంధించి 27 డిసెంబర్ 2021న భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరూ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. పిల్లల కోసం ఈ టీకా డ్రైవ్ 03 జనవరి 2022 నుంచి ప్రారంభించారు. సిబిఎస్‌ఈ బోర్డుతో సహా ఇతర రాష్ట్ర బోర్డు పాఠశాలల్లో పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు ప్రైవేటు పాఠశాలలను కూడా ప్రోత్సహిస్తున్నారు.

Bangarraju: నాగచైతన్యనే పై చేయి సాధించాడు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగార్జున..

IBPS PO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మీ స్కోర్‌ ఎంతో తెలుసుకోండి..

ఒకే ఒక్క రక్త పరీక్షతో క్యాన్సర్‌ని గుర్తించవచ్చు..! పరిశోధనలో షాకింగ్‌ విషయాలు వెల్లడి..