Bangarraju: నాగచైతన్యనే పై చేయి సాధించాడు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగార్జున..

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్త‌య్యింది.

Bangarraju:  నాగచైతన్యనే పై చేయి సాధించాడు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగార్జున..
Nagarjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 05, 2022 | 7:26 PM

Bangarraju: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నూత‌న సంవ‌త్స‌రం రోజున బంగార్రాజు టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. నాగార్జున పంచెక‌ట్టులో నాగ‌చైత‌న్య స్టైలీష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వ‌హిస్తున్న‌ ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 14న ప్రేక్షకుల  ముందుకు తీసుకురానున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో వ‌చ్చిన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేయగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే లడ్డుండా.. నాకోసం మారవా నువ్వు పాటకు కూడా మంది స్పందన వచ్చింది.

తాజాగా  విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్. ఈ క్రమంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్.  ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. సినిమాను మొదటి నుంచి పండగ సినిమా.. పండగలాంటి సినిమా అంటూ చెప్పుకుంటూ వస్తున్నాం కుదిరింది కాబట్టి ఈ సంక్రాంతి వస్తున్నాం లేకుంటే నెక్స్ట్ సంక్రాంతిని టార్గెట్ చేసి షూటింగ్ మొదలుపెట్టేవాళ్ళం అని అన్నారు నాగార్జున. ఆర్ఆర్ఆర్ , రాధేశ్యామ్ సినిమాలు రిలీజ్ అయినా కూడా మా సినిమాను రిలీజ్ చేసేవాళ్ళం.. ఆ రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ఉంటే దైర్యంగా ఉండేది అన్నారు నాగార్జున. సినిమా మంచి విజయం సాదిస్తుంది అని నమ్మకం ఉంది అన్నారు నాగార్జున. ఇక ఈ సినిమా చైతన్య నేను ఎవరి స్టైల్ లో వాళ్ళు చేశాం.. అన్నారు నాగ్. అయితే నాగచైతన్యనే బంగార్రాజుగా పై చేయి సాధించాడు అని అన్నారు. ఇప్పటివరకు చైతన్య కు విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా పడలేదు. ఈ సినిమా ఖచ్చితంగా చైతూ నటనకు, కెరీర్ కు హెల్ప్ అవుతుంది అన్నారు.  అలాగే శివుడి కాన్సెప్ట్ తో వస్తున్నాం వాయిదా పడదు అనుకుంటున్నాం అన్నారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!

Megastar Chiranjeevi: సేనాపతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రాజేంద్రప్రసాద్ నటనపై ఆసక్తికర కామెంట్స్..

Pushpa: ఇట్స్ అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ