Telangana: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా కోచింగ్‌.. ఇలా అప్లై చేసుకోండి..

Telangana: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న ఔత్సాహిక అభ్యర్థులకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది...

Telangana: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా కోచింగ్‌.. ఇలా అప్లై చేసుకోండి..
Ts Govt Jobs
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2022 | 4:00 PM

Telangana: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న ఔత్సాహిక అభ్యర్థులకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తర్వలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న గ్రూప్‌ 3, 4, గురుకుల పాఠశాలలో నియామకాలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లకు వెళ్లడం ఇబ్బందిగా ఉన్న బీసీ అభ్యర్థులకు ఈ అవకాశం కల్పించారు. ఉచిత శిక్షణ పొందాలనుకుంటున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

అర్హులు ఎవరంటే..

ఉచిత శిక్షణ పొందాలనుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలలోపు ఉండాలి. గ్రూప్‌ 3, 4 ప్రిపేర్‌ అయ్యే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గురుకుల టీచర్ల పోస్ట్‌లకు ప్రిపేర్‌ అయ్యే వారు బీఈడీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు 25-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ను 27-08-2022 తేదీన ప్రకటిస్తారు. అనంతరం ఉచిత శిక్షణ 01-09-2022 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 040-27077929/040-24071178 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి