DRDL-RCMA Recruitment: హైద‌రాబాద్ డీఆర్‌డీఎల్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులు.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

DRDL-RCMA Recruitment: డీఆర్‌డీఎల్‌కు చెందిన రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్‌(RCMA ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్‌లో ఉన్నఈ సంస్థలో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.?

DRDL-RCMA Recruitment: హైద‌రాబాద్ డీఆర్‌డీఎల్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులు.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2022 | 9:01 AM

DRDL-RCMA Recruitment: డీఆర్‌డీఎల్‌కు చెందిన రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్‌(RCMA ) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్‌లో ఉన్నఈ సంస్థలో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.? అర్హ‌త‌లు ఏంటి.? అన్న విశేషాలు మీకోసం..

భర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 02 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, మెకానికల్‌ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి బీటెక్‌/బీఈ/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు నెట్‌/గేట్‌ అర్హత సాధించి ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 28 ఏళ్లు మించ‌కూడదు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తులను రీజనల్‌ డైరెక్టర్, ఆర్‌సీఎంఏ(మిసైల్స్‌), డీఆర్‌డీఎల్‌ క్యాంపస్, కాంచన్‌బాగ్, హైదరాబాద్‌–500058 అడ్ర‌స్‌కు పంపించాలి.

* అభ్య‌ర్థుల‌ను తొలుత అక‌డ‌మిక్ ప్ర‌తిభ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కునెల‌కు రూ. 31,000 జీతంగా అందిస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 30-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Varshini Sounderajan: ట్రెడిషనల్ డ్రెస్సెస్ అదరగొట్టిన వర్షిణి లేటెస్ట్ ఇమేజెస్

Budget 2022: బడ్జెట్ ప్రతిపాదనల నుంచి వ్యవసాయ రంగం ఏం ఆశిస్తోంది.. నిపుణుల సూచనలు ఏమిటి?

TOP 9 ET News: చిరు వెనకడుగు..! | సంక్రాంతి గుర్రంపై బాలయ్య.. వీడియో