Budget 2022: బడ్జెట్ ప్రతిపాదనల నుంచి వ్యవసాయ రంగం ఏం ఆశిస్తోంది.. నిపుణుల సూచనలు ఏమిటి?

బడ్జెట్ 2022(Budget 2022) సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వరుసగా నాలుగోసారి ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్(Nirmala  Sitharaman) ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Budget 2022: బడ్జెట్ ప్రతిపాదనల నుంచి వ్యవసాయ రంగం ఏం ఆశిస్తోంది.. నిపుణుల సూచనలు ఏమిటి?
Agriculture Budget 2022
Follow us
KVD Varma

|

Updated on: Jan 15, 2022 | 9:13 PM

బడ్జెట్ 2022(Budget 2022) సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. వరుసగా నాలుగోసారి ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్(Nirmala  Sitharaman) ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపధ్యంలో వివిధ వర్గాల ప్రజలు రాబోయే బడ్జెట్ గురించి ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి నేపధ్యంలో ద్రవ్యోల్బణం(Inflation) పెరిగిపోతున్న తరుణంలో నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ పై ప్రజల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ఇక బడ్జెట్ విషయంలో వ్యవసాయ రంగానికి సంబంధించి విశేష ప్రాధాన్యం ఉంది. మన దేశం స్వతహాగా వ్యవసాయ ఆధారిత ప్రజలు ఎక్కువగా ఉన్న దేశం కావడంతో బడ్జెట్ తీరుతెన్నులపై వ్యవసాయ వర్గాలకూ చాలా ఆశలు ఉన్నాయి. ప్రీ బడ్జెట్ సన్నాహాల్లో భాగంగా ఇటీవల ఆర్ధిక శాఖ అధికారులు వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, రైతు సంఘాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ పై వ్యవసాయ రంగ నిపుణుల నుంచి పలు సూచనలు వచ్చాయి. అవేమిటో తెలుసుకుందాం.

వాస్తవిక ఉత్పత్తి వ్యయం, డీజిల్‌పై అధిక రాయితీలు .. జన్యుపరంగా మార్పు చెందిన జీవుల (GMOలు) వంటి కొత్త సాంకేతికతలను గురించి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘ ప్రతినిధులు ఎక్కువగా సూచనలు చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే, వ్యవసాయానికి ఇచ్చే ప్రాధాన్య రంగ రుణాలను ప్రభుత్వం 25 శాతం పెంచాలని కన్సార్టియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్స్ (సిఫా) ముఖ్య సలహాదారు పి చెంగల్ రెడ్డి అన్నారు. పంటల ధరల విధానంపై ప్రభుత్వ సలహా సంఘంగా ఉన్న వ్యవసాయ ఖర్చులు .. ధరల కమిషన్‌కు వాస్తవిక ఉత్పత్తి వ్యయాన్ని నిర్ధారించడం ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) నిర్ణయించడానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని ఆయన సూచించారు. ఉత్పాదకతను పెంచడానికి “GMOతో సహా సాంకేతికతలను” సమయానుకూలంగా అనుమతించడం అవసరమని ఆయన గట్టిగా చెప్పారు.అదేవిధంగా ఇక్రిసాట్(ICRISAT),ఐసీఏఆర్(ICAR) వంటి సంస్థలు అభివృద్ధి చేసిన జన్యు సాంకేతికతకు తక్షణ ఆమోదం కోసం ఆయన డిమాండ్ చేశారు.

కార్మికుల కొరత .. అధిక లేబర్ ధరను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని CIFA కోరింది. నరేగా( MNREGA)ని అన్ని వ్యవసాయ కార్యకలాపాలకు అనుసంధానం చేయాలని ఆ సంస్థ తరఫున చెంగల్ రెడ్డి సూచించారు. అంతేకాకుండా, పురుగుమందులపై పన్నులను తగ్గించాలని కూడా వ్యవసాయ రంగం నుంచి సూచనలు వచ్చాయి. 50 శాతం రాయితీపై పంట కోతకు .. నాట్లు వేయడానికి ప్రతి సీజన్‌కు 5,000 లీటర్ల డీజిల్‌ను అందించాలని వ్యవసాయ నిపుణులు సిఫారసు చేశారు.

ఇవి కూడా చదవండి: Budget 2022: వారిపై తగ్గనున్న పన్ను భారం.. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిపై బడ్జెట్‌లో కీలక ప్రకటన?

Budget 2022: పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం..వర్క్ ఫ్రమ్ హోమ్ పై బడ్జెట్‌కు ముందు కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు

కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..