Delhi University Recruitment 2022: ఢిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) దేశబంధు కాలేజీలొ.. శాశ్వత ప్రాతిపదికన 40 నాన్ టీచింగ్ (Non Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
Delhi University Non Teaching Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) దేశబంధు కాలేజీలొ.. శాశ్వత ప్రాతిపదికన 40 నాన్ టీచింగ్ (Non Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 25 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఆగస్టు 20, 2022వ తేదీన విడుదలైంది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు ఖచ్చితంగా రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.