Telangana Crime News: ‘నా భర్తను చంపేయ్‌! మనిద్దరం హాయిగా బతుకుదాం’

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని గుట్టుచప్పుడుకాకుండా ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిందో భార్య. ఈ విషయం బయటికి రాకుండా మృత దేహాన్ని మూట గట్టి..

Telangana Crime News: 'నా భర్తను చంపేయ్‌! మనిద్దరం హాయిగా బతుకుదాం'
Khammam Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 26, 2022 | 8:10 AM

Telangana News: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని గుట్టుచప్పుడుకాకుండా ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిందో భార్య. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా ఆరెంపులకు చెందిన సాయిచరణ్‌(28) చికెన్‌ వ్యర్థాలు తరలించే వాహన డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. సాయిచరణ్‌కు కొణిజర్ల మండలానికి చెందిన యువతి(25)ని నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. సాయి డ్రైబర్‌గా ఉన్న వాహనంలోనే కరుణాకర్‌(30) అనే మరో యువకుడు కూడా కలిసి పనిచేసేవాడు. ఇద్దరి మధ్య స్నేహంతో తరచూ కరుణాకర్‌ సాయి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో సాయి భార్యతో కరుణాకర్‌కు పరిచయం ఏర్పడి, పరిచయం వివాహేతర సంబంధంగా దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న సాయి భార్యతో పలుమార్లు గొవడపడ్డాడు. భర్తకు విషయం తెలిసిందని ఇంకా ఎవరికైనా తెలిస్తే పరువుపోతుందని భావించిన ఆమె ప్రియుడితో కలిసి పథకం పన్నింది. ముందుగా అన్నకున్నట్లుగా ఆగస్టు 1వ తేదీన రాత్రి చికెన్‌ వ్యర్థాలు తీసుకెళ్లేందుకు సిద్ధమైన వీరిద్దరూ మరో ఇద్దరు డ్రైవర్లతో కలిసి ఫూటుగా మద్యం సేవించారు. ఈ సమయంలో కరుణాకర్‌కు సాయికి మద్య వివాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న కరుణాకర్‌ సాయిన బలంగా తోసేయడంతో ట్రాలీ ఆటోకు గుద్దుకుని కింద పడ్డాడు. అనంతరం పారతో సాయిని బలంగా కొట్టడంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆ తర్వాత మృతదేహాన్ని మూటగట్టి చికెన్‌ వ్యర్థాలు తరలించే వాహనం వేసుకుని ఓ ప్రైవేటు చేపల చెరువులో మృతదేహాన్ని పడేశాడు. 3 రోజుల తర్వాత మృతదేహం చేపల చెరువులో తేలడంతో యజమాని కరుణాకర్‌కు ఫోన్‌ చేశాడు. కరుణాకర్‌ మృతదేహాన్ని పక్కనే ఉన్న ఊరి చెరువులో పడేసి అతని భార్యకు విషయం తెలియజేశాడు. సుమారు 10 రోజులుగా సాయి కనిపించకపోవడంతో బంధువులు సాయి భార్యను అడిగితే తెలియదని బుకాయించింది. ఖమ్మం రెండోపట్టణ ఠాణాలో భర్త అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయి ఫోన్‌ కాల్‌ లిస్టు చెక్‌ చేయగా భార్యతో ఎక్కువ సార్లు ఫోన్‌ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానం వచ్చిన పోలీసులు సాయి భార్యను నిలదీయగా అసలు విషయం బయటపడింది. సాయి భార్యతోపాటు, కరుణాకర్‌, అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఐతే సాయి మృతదేహం కోసం పోలీసులు ఎంత గాలించినా ఇంత వరకు లభ్యంకాలేదు. దీంతో సాయి బంధువుల్లో ఆందోళన నెలకొంది.