హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట.. పదవీ విరమణకు ఒక రోజు ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీపికబురు..

సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్‌ జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ చేపట్టారు.

హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీంలో ఊరట.. పదవీ విరమణకు ఒక రోజు ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీపికబురు..
Nv Ramana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 25, 2022 | 1:57 PM

Good News For Hyderabad journalists: హైదరాబాద్‌ జర్నలిస్టులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. పదవీ విరమణకు ఒక రోజు ముందు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీపి కబురు చెప్పారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్‌ జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ చేపట్టారు. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది.. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడటం లేదు. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి? అని ప్రశ్నించారు.

రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు. వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదన్నారు. వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారని, జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నామని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయండని ఆయన సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి