MLA Raja Singh: రాజాసింగ్‌ అరెస్ట్‌కు నిరసనగా బేగంబజార్‌ బంద్‌.. స్వచ్చందంగా షాపులు మూసివేసిన వ్యాపారస్తులు

ప్రివెంటివ్ డిటెన్షన్ (PD) యాక్ట్ నమోదు చేయడంపై వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని బేగంబజార్ మార్కెట్‌ను బంద్ చేశారు వ్యాపారులు. చర్లపల్లి జైలు కీ..

MLA Raja Singh: రాజాసింగ్‌ అరెస్ట్‌కు నిరసనగా బేగంబజార్‌ బంద్‌.. స్వచ్చందంగా షాపులు మూసివేసిన వ్యాపారస్తులు
Begum Bazar
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 25, 2022 | 7:06 PM

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ (PD) యాక్ట్ నమోదు చేయడంపై వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని బేగంబజార్ మార్కెట్‌ను బంద్ చేశారు వ్యాపారులు. చర్లపల్లి జైలు కీ తరలించడంతో బేగంబజార్, ముక్తార్ గంజ్, మహారాజ్ గంజ్, కిషన్ గంజ్ తదితర మార్కెట్లో ఉన్న దాదాపు 1వెయ్యికి పైగా దుకాణాలు స్వచ్చందంగా ముసివేసి రాజాసింగ్‌కు మద్దతు పలికారు. దీంతో బేగంబజార్ మార్కెట్‌లోని దుకాణాల వద్ద వ్యాపారస్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అఫ్జల్ గంజ్, షాహినాయత్ గంజ్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.

చర్లపల్లి జైలుకు రాజాసింగ్‌..

వివాదాస్పద వీడియోలతో మంటలు పుట్టించిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. పీడియాక్ట్‌ నమోదు చేసి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. మంగళ్‌హాట్‌ పీఎస్‌లో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ నమోదై ఉంది. 2004 నుంచి రాజాసింగ్‌పై 101 కేసులు ఉండగా, వాటిపై 18 మతపరమైన కేసులు ఉన్నాయి. అరెస్టు విషయం కనీసం మీడియాకు కూడా తెలియకుండా పోలీసులు చాకచక్యంగా రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకుని చర్లపల్లికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రెండు కేసుల్లో రాజాసింగ్‌కు నోటీసులు ఇచ్చి అరెస్ట్‌ చేశారు పోలీసులు. అందులో ఒకటి ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మంగళ్‌హాట్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. మరోకేసు షాహీనాత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీన నమోదైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా రాజాసింగ్‌ పాటలు పాడారన్న ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే 41 (A) CRPC ప్రకారం నిన్న నోటీసు ఇచ్చారు మంగళ్‌హాట్‌ పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం