BECIL Recruitment: డిగ్రీ అర్హ‌త‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..

BECIL Recruitment 2021: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ సంస్థలో పోస్టుల‌ను కాంట్రాక్ట్ విధానంలో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

BECIL Recruitment: డిగ్రీ అర్హ‌త‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి..
Follow us

|

Updated on: Jan 18, 2022 | 8:17 PM

BECIL Recruitment 2021: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ సంస్థలో పోస్టుల‌ను కాంట్రాక్ట్ విధానంలో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు..

భ‌ర్తీచేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 500 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో ఇన్వెస్టిగేట‌ర్లు (350), సూప‌ర్ వైజ‌ర్లు (150) పోస్టులు ఉన్నాయి.

* ఇన్వెస్టిగేటర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తో పాటు స్థానిక భాష తెలిసి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 50 ఏళ్లు మించ‌కూడ‌దు.

* సూపర్‌వైజర్ పోస్టుల‌కు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తో పాటు స్థానిక భాష తెలిసి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 50 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థులు తమ పూర్తి వివరాల‌ను projecthr@becil.com ఈమెయిల్‌కు పంపించాలి.

* ఇన్వెస్టిగేట‌ర్ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ. 24,000, సూప‌ర్ వైజ‌ర్ పోస్టుల‌కు రూ. 30000 జీతంగా చెల్లిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను టెస్ట్‌/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 25-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: IND VS SA: ఆరో బౌలర్‌ కొరత తీరింది.. స్పిన్నర్లలో ఒకరికి ఛాన్స్: తొలి వన్డే ముందు కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు

Best Recharge plans: రూ. 150 లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా.? అయితే ఈ ఆఫ‌ర్ల‌ను కంపేర్ చేసుకోండి..

Apple Safari: యాపిల్ యూజ‌ర్లకు అల‌ర్ట్‌.. ప్ర‌మాదంలో మీ వ్య‌క్తిగ‌త స‌మాచారం.. పూర్తి వివ‌రాలు..