AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIRDPR Recruitment: హైదారాబాద్ ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థుల ఎంపిక‌..

NIRDPR Recruitment 2022: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (NIRDPR)లో ప‌లు ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో...

NIRDPR Recruitment: హైదారాబాద్ ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థుల ఎంపిక‌..
Narender Vaitla
|

Updated on: Jan 18, 2022 | 6:58 PM

Share

NIRDPR Recruitment 2022: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (NIRDPR)లో ప‌లు ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థ‌లో కాంట్రాక్ట్ విధానంలో పోస్టుల‌ను తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.?

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌లో భాగంగా ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్‌, డేటా అనలిస్ట్‌, ప్రాజెక్ట్ అసోసియేట్, ఫైనాన్స్ అసోసియేట్, ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సోషల్‌ సైన్సెస్‌/ మేనేజ్‌మెంట్/ హ్యుమానిటీస్‌/ సోషల్‌ వర్క్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* డేటా అన‌లిస్ట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేస్తుకునేవారు సోషల్‌ సైన్సెస్‌/ మేనేజ్‌మెంట్‌/ స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సోషల్‌ సైన్సెస్‌/ కామర్స్‌/ మేనేజ్‌మెంట్‌/ హ్యుమానిటీస్‌లో ఎంఏ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

* ఫైనాన్స్ అసోసియేట్ పోస్టుల‌కు కామర్స్‌, కంప్యూటర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

* ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను అనుభ‌వం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 26-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Tesla Plant: టెస్లాకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన బీజేపీ పాలిత రాష్ట్రం.. పూర్తి వివరాలు

AP Corona Cases: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఆ 2 జిల్లాల్లో వైరస్ కల్లోలం

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..