Apple Safari: యాపిల్ యూజ‌ర్లకు అల‌ర్ట్‌.. ప్ర‌మాదంలో మీ వ్య‌క్తిగ‌త స‌మాచారం.. పూర్తి వివ‌రాలు..

Apple Safari: టెక్నాల‌జీతో పాటు నేరాలు కూడా మారుతున్నాయి. ఒక చిన్న బ‌గ్‌ను కంప్యూట‌ర్‌, స్మార్ట్‌ఫోన్‌లోకి పంపించి మొత్తం డేటాను కాజేస్తున్నారు సైబ‌ర్ నేర‌గాళ్లు. తాజాగా యాపిల్ ఫోన్‌ల‌లో ఇలాంటి ఓ బ‌గ్‌ను గుర్తించారు నిపుణులు...

Apple Safari: యాపిల్ యూజ‌ర్లకు అల‌ర్ట్‌.. ప్ర‌మాదంలో మీ వ్య‌క్తిగ‌త స‌మాచారం.. పూర్తి వివ‌రాలు..
Apple Phone
Follow us

|

Updated on: Jan 18, 2022 | 3:18 PM

Apple Safari: టెక్నాల‌జీతో పాటు నేరాలు కూడా మారుతున్నాయి. ఒక చిన్న బ‌గ్‌ను కంప్యూట‌ర్‌, స్మార్ట్‌ఫోన్‌లోకి పంపించి మొత్తం డేటాను కాజేస్తున్నారు సైబ‌ర్ నేర‌గాళ్లు. తాజాగా యాపిల్ ఫోన్‌ల‌లో ఇలాంటి ఓ బ‌గ్‌ను గుర్తించారు నిపుణులు. స‌హ‌జంగా సెక్యూరిటీకి పెట్టింది పేరైన యాపిల్ ఫోన్ల‌లోనే ఇలాంటి లోపం బ‌హిర్గ‌తం కావ‌డం గ‌మానార్హం. వివ‌రాల్లోకి వెళితే.. యాపిల్ యూజ‌ర్లు ఉప‌యోగించే స‌ఫారీ బ్రౌజ‌ర్‌లో బ‌గ్ కార‌ణంగా ప‌ర్స‌న‌ల్ డేటాతో పాటు గూగుల్ అకౌంట్ వివ‌రాలు బ‌హిర్గ‌తం అవుతున్న‌ట్లు అమెరికాకు చెందిన ఫింగర్‌ప్రింట్‌జేఎస్‌ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది.

స‌ఫారీ బ్రౌజ‌ర్ల‌లో బ్రౌజింగ్ డేటా స్టోర్ చేసేందుకు ఉపయోగించే ప్రోగ్రామింగ్‌లో ఈ బ‌గ్ ఉన్న‌ట్లు గుర్తించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ బ‌గ్ ద్వారా సైబ‌ర్ నేర‌గాళ్లు గూగుల్‌తో పాటు, ఇన్‌స్టాగ్రామ్‌, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మ‌రికొన్ని ప్ర‌ముఖ వెబ్‌సైట్ల‌కు సంబంధించిన స‌మాచారం బ‌హిర్గ‌తం అయినట్లు నిపుణులు చెబుతున్నారు. జ‌న‌వ‌రి 15న వెలుగులోకి వ‌చ్చిన ఈ బ‌గ్‌ను స‌రిదిద్దేందుకు యాపిల్ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఇక ప్రస్తుతం అప్‌డేట్ విడుద‌ల చేసే ప‌నిలో ఉంది యాపిల్‌. అప్ప‌టి వ‌ర‌కు స‌ఫారీ బ్రౌజ‌ర్‌ను ఉప‌యోగించ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

Also Read: NTR – Lakshmi Parvathi: నాతో ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడింది.. సంచలన ప్రకటన చేసిన లక్మీపార్వతి..

Punjab Assembly Election 2022: భగవంత్ మాన్.. మా పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి.. కీలక ప్రకటన చేసిన ఆప్ అధినేత..

Minister Harish Rao: వ్యాక్సీన్ వ్యవధి తగ్గించండి.. కేంద్ర మంత్రికి లేఖ రాసిన మంత్రి హరీష్ రావు..