AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR – Lakshmi Parvathi: నాతో ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడింది.. సంచలన ప్రకటన చేసిన లక్మీపార్వతి..

NTR – Lakshmi Parvathi: ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కీలక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నివాళులర్పించిన అనంతరం సంచలన విషయాలను వెల్లడించారు. న్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో తాను మాట్లాడానని తెలిపారు. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నానని.. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత, రాజశేఖర్‌ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారన్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ 16ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి తనతో […]

NTR - Lakshmi Parvathi: నాతో ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడింది.. సంచలన ప్రకటన చేసిన లక్మీపార్వతి..
Lakshmi Parvathi
Sanjay Kasula
|

Updated on: Jan 18, 2022 | 1:58 PM

Share

NTR – Lakshmi Parvathi: ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కీలక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ 26వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నివాళులర్పించిన అనంతరం సంచలన విషయాలను వెల్లడించారు. న్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో తాను మాట్లాడానని తెలిపారు. 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నానని.. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు జీవిత, రాజశేఖర్‌ తనను మద్రాస్ తీసుకెళ్లి ఒక అమ్మాయితో మాట్లాడించారన్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ 16ఏళ్ల అమ్మాయిలో ప్రవేశించి తనతో అనేక విషయాలు పంచుకుందని లక్ష్మీపార్వతి వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో తాను మళ్లీ జన్మిస్తానని.. అందరి ముఖ్యమంత్రుల మనస్సులో తాను ఉంటానని.. ప్రజలకు మంచి చేయాలని తాను ప్రబోధం చేస్తుంటానని తనతో ఎన్టీఆర్ ఆత్మ చెప్పిందన్నారు.

ఆ అమ్మాయితో మాట్లాడినప్పటి నుంచి తనకు ఓ నమ్మకం కలిగిందని అన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడూ తెలుగు ప్రజలను విడిచిపెట్టి ఉండరని అభిప్రాయపడ్డారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ ఆత్మ ఇక్కడే.. మన చుట్టూ ఉంటుందన్నారు. ఈ ఘాట్‌ దగ్గరని కాదు కానీ… తెలుగు రాష్ట్రాల ప్రజలందరి వద్ద ఆయన ఆత్మ తిరుగుతూ.. అందరి బాగోగులు చూసుకుంటోందని అన్నారు.

ఎన్టీఆర్ మహానుభావుడని.. ఎప్పటికీ ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారని అన్నారు. జాతికి ఇలాంటి వారు ఒకళ్లే పుడతారన్నారు. తెలుగువారి గౌరవాన్ని చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నో పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారన్నారు. తాను బతికున్నంతవరకు ఎన్టీఆర్ తనకు తోడుగా ఉంటారని.. అడుగుడుగనా తనను రక్షించుకుంటూనే ఉన్నారని.. ఆయన జ్ఞాపకాల్లోనే తాను ఇంకా బతుకుతున్నానన్నారు లక్ష్మీపార్వతి.

ఇవి కూడా చదవండి: Bone Health Tips: ఎముకలను బలహీనపరిచే అలవాట్లను మానేయండి.. వాటిని నేటి నుంచే మార్చుకోండి..

ఇప్పుడు మీ ఫోన్ వాకీ టాకీ మార్చుకోవచ్చు.. మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..