AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Exams: ఆ 8 నోటిఫికేషన్లకు ఉమ్మడిగా ఒకే జనరల్‌ స్టడీస్‌ పరీక్ష.. ఏపీపీఎస్సీ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది జారీ చేసిన 8 జాబ్ నోటిఫికేషన్లకు ఒకే సిలబస్ తో పేపర్ 1 పరీక్ష ఉన్నట్లు గుర్తించిన ఏపీపీఎస్సీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్లన్నింటికీ ఒకే రోజు ఒకే సమయంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. దీంతో ఈ 8 రకాల పోస్టులకు నియామక పరీక్ష ఒకే రోజు జరగనుంది..

APPSC Exams: ఆ 8 నోటిఫికేషన్లకు ఉమ్మడిగా ఒకే జనరల్‌ స్టడీస్‌ పరీక్ష.. ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
APPSC Exams
Srilakshmi C
|

Updated on: Jan 12, 2025 | 12:26 PM

Share

అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) సరి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. గతంలో జారీచేసిన 8 రకాల నోటిఫికేషన్లకు రాత పరీక్షలకు సంబంధించి తాజాగా షడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు వచ్చే ఏప్రిల్‌ 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అయితే ఈ 8 పరీక్షల్లోనూ ‘పేపరు 1’ కింద జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ పేపర్‌ ఉమ్మడి ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీపీఎస్సీ ఈ 8 పరీక్షలకు పేపర్ 1ను ఉమ్మడిగా నిర్వహిచాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 28వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జనరల్ స్టడీస్‌ పేపర్ నిర్వహిస్తామని వెల్లడించింది. ఒకే సిలబస్‌తో పరీక్ష నిర్వహిస్తున్నందున అభ్యర్థుల సన్నద్ధతకు సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొంది. పైగా ప్రశ్నపత్రం రూపకల్పన, మూల్యాంకనం సులువుగా ఉంటుందని ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌ అనురాధ తెలిపారు.

ఏయే పరీక్షలు జరగనున్నాయంటే..

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (టౌన్‌ ప్లానింగ్‌), లైబ్రేరియన్‌ (వైద్య ఆరోగ్యశాఖ), అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (దివ్యాంగుల సంక్షేమశాఖ), అసిస్టెంట్‌ కెమిస్ట్‌ (భూగర్భ నీటిపారుదల), అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏపీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ సర్వీస్‌), అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిటికల్‌), ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఫిషరీస్‌ సర్వీసెస్‌) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు గతేడాది వెలువడిన సంగతి తెలిసిందే. వీటికి అనుగుణంగా కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలు కృష్ణా, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో జరుగుతాయని ఏపీపీఎస్సీ తెలిపింది. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

‘1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం కల్పించాల్సిందే’

మరోవైపు ఏపీపీఎస్సీ గ్రూపు-1 మెయిన్‌ పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్‌లో 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రూప్‌ 2, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సతం 1:100 నిష్పత్తి విధానాన్ని అనుసరించారని కోరుతున్నారు. అలాగేప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో.. క్యారీఫార్వర్డ్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌పై పునఃపరిశీలన జరపాలని పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. గతేడాది ఆగస్టులో జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా మహిళలకు రోస్టర్‌ పాయింట్లు కేటాయించారన్నారు. ఈ విధానంపై పునఃపరిశీలన జరిపి, పురుష అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.