AP Secretariat Jobs: ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు! ఇలా దరఖాస్తు చేసుకోండి

అమరావతి సెక్రటేరియట్‌లోని రియల్‌ టైం గవర్నెన్స్‌ సొసైటీ పరిధిలోని వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్‌టీజీఎస్‌,  ఎవేర్‌ హబ్‌, ఆర్‌టీజీఎస్‌, ఆర్‌టీజీఎస్‌ విభాగంలో అడ్మినిస్ట్రేషన్‌, డేటా ఇంటిగ్రేషన్‌ అండ్‌ అనలిటిక్స్‌ హబ్‌ తదితర విభాగాల్లో మొత్తం 60 రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు..

AP Secretariat Jobs: ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేదు! ఇలా దరఖాస్తు చేసుకోండి
AP Secretariat Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 12, 2025 | 12:45 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అమరావతి సెక్రటేరియట్‌లో పలు కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెక్రటేరియట్‌లో రియల్‌ టైం గవర్నెన్స్‌ సొసైటీ పరిధిలోని వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపాదికన మొత్తం 66 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే ఈ పోస్టున్నింటినీ భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 25, 2025వ తేదీ లోగా మెయిల్‌ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. పోస్టుల వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..

  • ఆర్‌టీజీఎస్‌ విభాగంలో పోస్టుల సంఖ్య: 02
  • ఎవేర్‌ హబ్‌ విభాగంలో పోస్టుల సంఖ్య: 03
  • ఆర్‌టీజీఎస్‌ విభాగంలో అడ్మినిస్ట్రేషన్‌ పోస్టుల సంఖ్య: 07
  • డేటా ఇంటిగ్రేషన్‌ అండ్‌ అనలిటిక్స్‌ హబ్‌ విభాగంలో పోస్టుల సంఖ్య: 08
  • ప్రొడక్ట్‌ డెవెలప్‌మెంట్‌ హబ్‌ విభాగంలో పోస్టుల సంఖ్య: 06
  • ఏఐ అండ్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ విభాగంలో పోస్టుల సంఖ్య: 10
  • పీపుల్‌ పర్సెప్సన్‌ హబ్‌ విభాగంలో పోస్టుల సంఖ్య: 20
  • మల్డీ సోర్స్‌ విజువల్‌ ఇంటలిజన్స్‌ హబ్‌ విభాగంలో పోస్టుల సంఖ్య: 10

ఈ 8 విభాగాల్లో.. చీఫ్‌ డేటా అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌, మేనేజర్‌, డేటా అనలిస్ట్‌, జనరల్‌ మేనేజర్‌-హెచ్‌ఆర్‌, మేనేజర్‌- ఆఫీస్‌ అడ్మిన్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌, బిజినెస్‌ అనలిస్ట్‌, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్స్‌, డేటా అర్కిటెక్ట్‌, డేటా గవర్నెన్స్‌ మేనేజర్‌, డేటా సైంటిస్ట్‌/ అనలిస్ట్‌, డేటా ఇంజినీర్స్‌/ డేటా సెక్యూరిటీ అండ్‌ కంప్లైన్స్‌ మేనేజర్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌, డైరెక్టర్‌, ఫుల్‌ స్టాక్‌ డెవెలపర్స్‌/ సీనీయర్‌ డెవెలపర్‌/ టీం లీడ్‌/ ఫ్రంట్‌ఎండ్‌ డెవెలపర్స్‌, క్యూఏ అండ్‌ టెస్టింగ్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం జారీ చేసింది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా(సీవీ)ని జనవరి 25, 2025వ తేదీ లోగా ఈ మెయిల్‌ ద్వారా పంపించవచ్చు.

ఈమెయిల్‌ ఐడీ: jobsrtgs@ap.gov.in

ఇవి కూడా చదవండి

అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.