AP TET 2024 Final Key: ఏపీ టెట్‌ ఫైనల్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల.. మరో రెండు రోజుల్లోనే ఫలితాలు!

ఏపీ టెట్ జులై-2024 పరీక్షల తుది ఆన్సర్ కీ విడుదలైంది. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన కీలను సెషన్ల వారీగా విడివిడిగా వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఈ కీ ఆధారంగానే టెట్ ఫలితాలు వస్తాయి. మరో రెండు రోజుల్లో టెట్ రిజల్ట్స్ కూడా రానున్నాయి. టెట్ ఆన్సర్ కీ కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి..

AP TET 2024 Final Key: ఏపీ టెట్‌ ఫైనల్‌ ఆన్సర్ 'కీ' విడుదల.. మరో రెండు రోజుల్లోనే ఫలితాలు!
AP TET 2024 Final Key
Follow us

|

Updated on: Oct 30, 2024 | 6:31 AM

అమరావతి, అక్టోబర్ 30: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్ జులై-2024) పరీక్షల తుది ఆన్సర్‌ ‘కీ’ వచ్చేసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో టెట్‌ తుది ఆన్సర్‌ కీని విడుదల చేసినట్లు విద్యాశాఖ పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 27వ తేదీనే ఫైనల్‌ కీ విడుదల కావల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అది అలస్యం అయ్యింది. తాజాగా అన్ని సబ్జె్క్టుల కీలను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారంగానే టెట్‌ ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

ఇక తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 2వ తేదీన టెట్‌ ఫలితాలు ప్రకటన ఉంటుంది. ఈ తేదీలో ఏవైనా అటుఇటుగా మార్పులు ఉంటే నవంబర్‌ తొలి వారంలో ఎప్పుడైనా టెట్‌ రిజల్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది. కాగా టెట్‌ పరీక్షలు అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగాగా.. వారిలో 3,68,661 మందిఅంటే 86.28 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 17 రోజల పాటు రోజుకు రెండు షిఫ్టులుగా ఈ పరీక్షలు నిర్వహించారు.

ఏపీ టెట్ జులై-2024 ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

అంతా అనుకున్నట్లు జరిగితే ఏపీలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ కూడా త్వరలోనే జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు… నవంబరు మొదటివారంలో మెగా డీఎస్సీ ఉద్యోగ ప్రకటన ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్‌ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. కాగా ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులనుఏ భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్ (ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్‌ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులు 7,725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీలు) పోస్టులు 1781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ (పీజీటీలు) పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ (పీఈటీలు) పోస్టులు 132 వరకు ఉన్నాయి. ఈ సారి భారీగా పోస్టులు ఉండటంతో నిరుద్యోగులంతా పోటాపోటీగా సన్నద్ధం అవుతున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
IPL 2025: ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ ఔట్?
IPL 2025: ఢిల్లీ నుంచి రిషబ్ పంత్ ఔట్?
తెలంగాణ గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ విడుదల..Hall Ticket విడుదల తేదీ
తెలంగాణ గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ విడుదల..Hall Ticket విడుదల తేదీ
పాపం..ఆ రైలు వస్తుందని ఊహించలేదేమో..ఒకేసారి తండ్రి కూతురు..
పాపం..ఆ రైలు వస్తుందని ఊహించలేదేమో..ఒకేసారి తండ్రి కూతురు..
పిడుగుపాటుకు బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
పిడుగుపాటుకు బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
Gold Price Today: దీపావళి రోజున షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే
Gold Price Today: దీపావళి రోజున షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే
ఈ రాశివారికి అన్నింటా విజయాలు, పట్టిందల్లా బంగారమే..
ఈ రాశివారికి అన్నింటా విజయాలు, పట్టిందల్లా బంగారమే..
TTD నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియామకం.. 24 మందితో కొత్త బోర్డు
TTD నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియామకం.. 24 మందితో కొత్త బోర్డు
ఐకాన్‌ స్టార్‌ వర్సెస్‌ సూపర్‌స్టార్‌. ఈ పోటీ పై నెల్సన్ క్లారిటీ
ఐకాన్‌ స్టార్‌ వర్సెస్‌ సూపర్‌స్టార్‌. ఈ పోటీ పై నెల్సన్ క్లారిటీ
దీపావళి సేల్‌లో జిగేల్‌మనే ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్స్‌పై డీల్స్‌..
దీపావళి సేల్‌లో జిగేల్‌మనే ఆఫర్లు.. స్మార్ట్‌ఫోన్స్‌పై డీల్స్‌..