TGPSC Group 1 Mains Exams: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు భారీగా తగ్గిన హాజరు శాతం.. కారణం అదేనా?

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు పలు వివాదాల నడుమ ఎట్టకేలకు రాష్ట్ర సర్కార్ ప్రశాంతంగా నిర్వహించింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ విభాగం అధికారులు సమన్వయంతో పటిష్ట భద్రత నడుమ పరీక్షలను నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి పలువురు అభ్యర్ధులు అధిక సంఖ్యలో భారీగా డుమ్మా కొట్టారు. ప్రస్తుతం దీనిపై సర్వత్రా చర్చ సాగుతుంది..

TGPSC Group 1 Mains Exams: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌కు భారీగా తగ్గిన హాజరు శాతం.. కారణం అదేనా?
TGPSC Group 1 Mains
Follow us

|

Updated on: Oct 29, 2024 | 8:18 AM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 29: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్‌ 21వ తేదీ నుంచి అక్టోబర్‌ 27వ తేదీ వరకు గ్రూప్‌ 1 పరీక్షలు జరిగాయి. మొత్తం 7 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి. అయితే ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన 31,383 మందీ పరీక్షలకు హాజరుకాలేదు. వీరిలో కేవలం 67.17శాతం మాత్రమే గ్రూప్‌ 1 మెయిన్స్‌కు హాజరయ్యారు. అంటే 21,181 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఈ మేరకు హాజరు శాతాన్ని టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఏడు పేపర్లకు (జనరల్‌ ఇంగ్లిష్‌ కలిపి) 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించింది. అక్టోబరు 21 నుంచి నిర్వహించిన పరీక్షలు అక్టోబరు 27తో ముగిశాయి.

మొత్తం 563 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా నిర్వహించిన గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు క్వాలిఫై అయిన మొత్తం 31,383 మందిలో హైకోర్టు అనుమతితో పరీక్షలకు హాజరైన 20 మంది స్పోర్ట్స్‌ అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరందరికీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 46 పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. అన్ని పేపర్లకు హాజరైన అభ్యర్థుల వివరాలను కేటగిరీల వారీగా టీజీపీఎస్సీ తాజాగా ప్రకటించింది.

క్రీడల కేటగిరీలోని అభ్యర్థులు మినహా అన్ని రిజర్వుడు విభాగాల్లోని అభ్యర్థులు ఓపెన్‌ కేటగిరీలోని పోస్టులకు మెయిన్స్‌ మెరిట్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని TGPSC కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ వెల్లడించారు. ఈ మెయిన్స్‌ పరీక్షల్లో మల్టీజోన్‌ 1, 2లలోని 5 శాతం అన్‌రిజర్వుడు పోస్టులకు మొత్తం 2550 మంది పరీక్షలు రాశారు. వీరిలో తెలంగాణ స్థానికత లేని అభ్యర్థులు 182 మంది వరకు ఉన్నట్లు కమిషన్‌ వెల్లడించింది. దివ్యాంగుల కేటగిరీలో 1:50 నిష్పత్తి ప్రకారం 1229 మంది అభ్యర్థులు మెయిన్స్‌ అర్హత సాధించినట్లు తెలిపారు. పరీక్షకు హాజరైన వారి విషయానికొస్తే ఈ గణాంకాల్లో స్వల్పమార్పులు ఉండే అవకాశముందని టీజీపీఎస్సీ పేర్కొంది. మెయిన్స్‌ వాయిదా వేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌ 1 అభ్యర్ధులు ఆందోళనలు చేపట్టినా.. వాటిని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా రేవంత్‌ సర్కార్‌ షెడ్యూల్‌ ప్రకారం గానే పరీక్షలు నిర్వహించింది. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పలువురు గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు దూరంగా ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ ముసుగుల్లో ఉన్న ఇద్దరూ మాములు ముదుర్లు కాదు..
ఈ ముసుగుల్లో ఉన్న ఇద్దరూ మాములు ముదుర్లు కాదు..
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!