DSC Free Coaching: ఉచిత డీఎస్సీ శిక్షణకు ప్రభుత్వ ప్రకటన.. వసతి, భోజనం, మెటీరియల్‌ ఫ్రీ.. ఫ్రీ..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువరించనుంచి. ఈ నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి గిరిజన సంక్షేమశాఖ కీలక ప్రకటన వెలువరించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా గిరిజన అభ్యర్థులకు ఉచితంగా మూడు నెలలపాటు డీఎస్సీ..

DSC Free Coaching: ఉచిత డీఎస్సీ శిక్షణకు ప్రభుత్వ ప్రకటన.. వసతి, భోజనం, మెటీరియల్‌ ఫ్రీ.. ఫ్రీ..!
DSC Free Coaching
Follow us

|

Updated on: Sep 11, 2024 | 8:13 AM

అమరావతి, సెప్టెంబర్‌ 11: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువరించనుంచి. ఈ నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి గిరిజన సంక్షేమశాఖ కీలక ప్రకటన వెలువరించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా గిరిజన అభ్యర్థులకు ఉచితంగా మూడు నెలలపాటు డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాల వారీగా దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 2,150 మంది దరఖాస్తు చేసుకున్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతాల నుంచి అధిక దరఖాస్తులు వచ్చాయి. గిరిజనేతర ప్రాంతాల నుంచి తక్కువ సంఖ్యలో వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లోనూ ప్రతి చోటా ఒక్కొక్క శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. గిరిజనేతర ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా రెండు లేదా మూడు చోట్ల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక్కో శిక్షణ కేంద్రంలో 100 నుంచి 150 మందికి శిక్షణ ఇస్తారు. త్వరలో ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది.

అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఇస్తారు. వసతి, భోజనం, మెటీరియల్‌ను ఉచితంగా ప్రభుత్వమే అందించనుంది. ఇందుకుగాను ఒక్కో అభ్యర్థిపై రూ.25 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. తొలి విడతలో వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్‌కు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఏపీ మెడికల్‌ కాలేజీల్లో ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన లేటరల్ ఎంట్రీ విధానంలో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆగస్టు నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పొస్టులకు దరఖాస్తు గడువు సెప్టెంబర్‌ 9తో ముగిసింది. అయితే తాజాగా ఈ గడువును ఈ నెల16 వరకు పొడిగించినట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.