Watch Video: ‘తాగుబోతు మనసు చూస్తూ ఆగలేకపోయింది సార్‌..’ ధ్వంసం చేస్తుంటే మద్యం సీసాలతో మందుబాబుల ఉడాయింపు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేస్తుండగా కొందరు మందుబాబులు వాటిని చేతబూని ఉడాయించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కొద్ది నిమిషాల పాటు అక్కడ గందరగోళం నెలకొంది. ఏకంగా పోలీసుల కళ్లెదుటే మందుబాబులు..

Watch Video: 'తాగుబోతు మనసు చూస్తూ ఆగలేకపోయింది సార్‌..' ధ్వంసం చేస్తుంటే మద్యం సీసాలతో మందుబాబుల ఉడాయింపు
Liquor Destruction
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 10, 2024 | 11:08 AM

గుంటూరు, సెప్టెంబర్‌ 10: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేస్తుండగా కొందరు మందుబాబులు వాటిని చేతబూని ఉడాయించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కొద్ది నిమిషాల పాటు అక్కడ గందరగోళం నెలకొంది. ఏకంగా పోలీసుల కళ్లెదుటే మందుబాబులు మద్యం సీసాల కోసం ఎగబడటం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే..

సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లావ్యాప్తంగా రూ.50 లక్షల విలువ చేసే 24,031 మద్యం సీసాలను పోలీసులు సీజ్‌ చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్డులోని నల్లచెరువులోని డంపింగ్‌యార్డులో మద్యం సీసాలను ధ్వంసం చేయడానికి ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఇలా సీజ్‌ చేసిన మద్యం సీసాలను ప్రొక్లోయిన్‌తో తొక్కించి ధ్వంసం చేస్తుంటారు. అయితే ప్రొక్లెయిన్‌ అక్కడికి చేరుకోవడానికి సోమవారం కొంత సమయం పట్టింది. ఈ లోపు పోలీసులు మద్యం సీసాలను రోడ్డుపై పేర్చారు. ప్రొక్లెయిన్‌ వచ్చాక.. వాటిని ధ్వసం చేయడం ప్రారంభించిన కాసేపటికే అధికారులు వెళ్లిపోయారు. ఈ తతంగం చూడానికి వచ్చిన స్థానికులు అదును కోసం ఎదురు చూడసాగారు.

ఇవి కూడా చదవండి

అధికారులు వెళ్లిపోగానే అమాంతం దూసుకొచ్చి మద్యం బాటిళ్లను పట్టుకుని పారిపోసాగారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. వారి ముందే సీసాలు ఎత్తుకెళ్లారు. వాళ్లను దొరక బుచ్చుకుని ప్రశ్నించగా.. ‘వృద్ధాగా నేలపాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాం.. సర్‌! క్షమించండి’ అంటూ కహానీలు చెప్పసాగారు. కొంత మంది నుంచి మద్యం బాటిళ్లను పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుంది. పారిపోయిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!