School Holiday: విద్యా సంస్థలకు అలర్ట్.. నేడు కూడా స్కూళ్లకు సెలవే!

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వరుసగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యా సంస్థలు, కార్యాలయాలకూ అడపా దడపా ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తూ వస్తుంది. అయితే ఈ రోజు (సెప్టెంబర్‌ 9) కూడా కొన్ని జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది..

School Holiday: విద్యా సంస్థలకు అలర్ట్.. నేడు కూడా స్కూళ్లకు సెలవే!
School Holiday
Follow us

|

Updated on: Sep 09, 2024 | 6:42 AM

అమరావతి, సెప్టెంబర్‌ 9: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వరుసగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యా సంస్థలు, కార్యాలయాలకూ అడపా దడపా ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తూ వస్తుంది. అయితే ఈ రోజు (సెప్టెంబర్‌ 9) కూడా కొన్ని జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యార్ధుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ (పునరావాస కేంద్రాలు & ముంపు ప్రాంతాలలో పాఠశాలలు), బాపట్లలోని కొన్ని మండలాల్లోని విద్యా సంస్థలకు ఈ రోజు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ధోని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో వరదలు సంభవించాయి. ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాన తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు, అత్యవసరం అయితేనే ఇళ్లనుంచి బయటికి రావాలని సూచించారు.

కోనసీమ జిల్లాలోని లంక వాసులకు వరద భయం వెంటాడుతుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించినప్పటికీ.. సముద్రంలోకి 9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. దీంతో ప్రజలు ఎటునుంచి వరద ముంచెత్తుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజాపులంక పల్లంవారిపాలెం ప్రాంతంలో వరద తీవ్రత వల్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు అల్లూరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి ఉద్ధృతంగా ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.