Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్‌.! ఐదు రోజులు వానలే వానలు..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్‌.! ఐదు రోజులు వానలే వానలు..

Anil kumar poka

|

Updated on: Sep 09, 2024 | 8:05 AM

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు దంచికొట్టనున్నాయి. రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తాంధ్రా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు దంచికొట్టనున్నాయి. రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తాంధ్రా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమలోనూ వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

ఇక గురువారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని.. అలాగే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవచ్చునని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తెలంగాణ అంతటా ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.