Viral Video: షాకింగ్ సీన్! కళ్లెదుటే ఆటో కింద పడిన తల్లి.. సింగిల్ హ్యాండ్‌తో పైకి లేపిన బాలిక! వీడియో

రోడ్లపై వెళ్లాలంటేనే వెయ్యి సార్లు ఆలోచించవల్సి వస్తుంది. ఎటునుంచి ప్రమాదం పొంచి ఉంటుందో చెప్పలేం. దీంతో రోడ్లపై వెళ్లేవారికి సేఫ్టీ లేకుండా పోయింది. వాహనదారులు హై స్పీడ్‌తో వాహనాలు నడుపుతూ జనసామాన్యాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నారు. పాదచారులు రోడ్డు క్రాస్ చేయడం కూడా అసాధ్యంగా మారింది. తాజాగా ఓ మహిళ రోడ్డు దాటి ఇవతలకు వస్తుండగా అనూహ్య రీతిలో ప్రమాదం చోటు చేసుకుంది..

Viral Video: షాకింగ్ సీన్! కళ్లెదుటే ఆటో కింద పడిన తల్లి.. సింగిల్ హ్యాండ్‌తో పైకి లేపిన బాలిక! వీడియో
School Girl Lifted Auto With Bare Hands
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 09, 2024 | 10:02 AM

మంగళూరు, సెప్టెంబర్ 9: రోడ్లపై వెళ్లాలంటేనే వెయ్యి సార్లు ఆలోచించవల్సి వస్తుంది. ఎటునుంచి ప్రమాదం పొంచి ఉంటుందో చెప్పలేం. దీంతో రోడ్లపై వెళ్లేవారికి సేఫ్టీ లేకుండా పోయింది. వాహనదారులు హై స్పీడ్‌తో వాహనాలు నడుపుతూ జనసామాన్యాన్ని భయాందోళనలకు గురి చేస్తున్నారు. పాదచారులు రోడ్డు క్రాస్ చేయడం కూడా అసాధ్యంగా మారింది. తాజాగా ఓ మహిళ రోడ్డు దాటి ఇవతలకు వస్తుండగా అనూహ్య రీతిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారి ఓ ఆటో మహిళపైకి దూసుకొచ్చింది. అయితే ఇవతల వైపుతల్లి కోసం ఎదరు చూస్తున్న ఓ స్కూల్‌ విద్యార్ధి మెరుపె వేగంతో తల్లిని కాపాడుకుంది. ఈ షాకింగ్‌ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మంగళూరులోని కిన్నీగోళి రామనగర్‌లో భయానక సంఘటన జరిగింది. రామనగర వద్ద ఓ మహిళ రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా దూసుకొచ్చిన ఓ ఆటో అదుపు తప్పి మహిళపైకి దూసుకెళ్లింది. అయితే రోడ్డుకు ఇవతల వైపున తల్లి కోసం ఎదురు చూస్తున్న స్కూల్‌ విద్యార్ధిని.. తల్లిపై ఆటో పడటం చూసి మెరుపు వేగంతో పరుగెత్తుకెళ్లింది. తన చేతులతో ఆటో అమాంతం ఎత్తి తల్లిని కాపాడుకుంది. తల్లిని కాపాడుకోవాలనే తాపత్రయంలో బాలికకు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. అంత బరువైన ఆటోను అలవోకగా ఎత్తిపడేసింది. గాయపడిన మహిళను రాజరత్నాపూర్‌కు చెందిన చేతన (35)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఘటన జరిగిన రోజు సాయంత్రం ట్యూషన్ కు వెళ్లిన తన కూతురిని తీసుకురావడానికి చేతన ట్యూషన్ సెంటర్ దగ్గరకు వచ్చింది. ఆటో దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కటిల్ నుంచి కిన్నిగోలి వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి మహిళపై ఆటో బోల్తా పడింది. సరిగ్గా కూతురు ఎదురుగానే ఆటో తల్లిని ఢీకొట్టింది. ఘటన అనంతరం అదే ఆటోలో మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు అందులోని ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు స్థానిక దుకాణంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఎంతో ధైర్య సాహసాలతో తల్లిని ఆటో ప్రమాదం నుంచి కాపాడిన బాలికను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.