Campus Placements: ఏపీలో మొదలైన కొలువుల సందడి.. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు షురూ

రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రాంగణ నియామకాలు మొదలయ్యాయి. ఆగస్టు 16 నుంచే మొదలైన ఈ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగనుంది. కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియ చేపట్టగా.. మరికొన్ని కంపెనీలు షెడ్యూల్‌లను విడుదల చేశాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం నియామకాలు మరింత పెరిగే అవకావం ఉన్నట్లు నిపుణులు భావిస్తు్నారు..

Campus Placements: ఏపీలో మొదలైన కొలువుల సందడి.. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు షురూ
Campus Placements
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 10, 2024 | 8:08 AM

అమరావతి, సెప్టెంబర్ 10: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రాంగణ నియామకాలు మొదలయ్యాయి. ఆగస్టు 16 నుంచే మొదలైన ఈ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగనుంది. కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియ చేపట్టగా.. మరికొన్ని కంపెనీలు షెడ్యూల్‌లను విడుదల చేశాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం నియామకాలు మరింత పెరిగే అవకావం ఉన్నట్లు నిపుణులు భావిస్తు్నారు. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఎంపికలు పుంజుకునే ఛాన్స్‌ ఉన్నట్లు పేర్కొంటున్నారు. కొన్ని కంపెనీలు ప్రెషర్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో గతేడాది కంటే నియామకాలు ఈసారి 20 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రాంగణ నియామకాలు పూర్తయిన తర్వాత జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షలనూ కంపెనీలు నిర్వహిస్తాయి. ఈ క్రమంలో కొన్ని స్టార్టప్‌ కంపెనీలు కూడా ఎంపికలు చేసుకుంటున్నాయి.

సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సులకు ఈ ఏడాది నవంబరు నుంచి వచ్చ ఏడాది ఫిబ్రవరి వరకు నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ బ్రాంచీల విద్యార్ధులను స్మార్ట్‌డీవీ సొల్యూషన్స్, ధీరజ్‌ ఇంజినీరింగ్, ఇండోసోల్‌ పవర్‌ ప్రాజెక్టు, పవర్‌ మెక్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలు ఎంపికలు నిర్వహిస్తాయి. ఎంపిక చేసిన కాలేజీలకు టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, మైండ్‌ట్రీ సంస్థలు షెడ్యూల్‌ ఇచ్చాయని విజయవాడ వీఆర్‌ సిద్దార్థ డీమ్డ్‌ యూనివర్సిటీ ప్రిన్సిపల్‌ రత్నకుమార్‌ తెలిపారు.

ఉమెన్‌ కాలేజీల్లో నియామకాలకు ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి సంస్థల షెడ్యూల్‌ వెలువడింది. రూ.9 లక్షల ప్యాకేజీ స్పెషలిస్టు ప్రొగ్రామర్‌కు ఇప్పటికే ఇన్ఫోసిస్‌ పరీక్ష నిర్వహించింది. ఐబీఎం కూడా పరీక్షల నిర్వహణకు త్వరలో తేదీలు ఇవ్వనుంది. విద్యార్థులు కళాశాలలో చదువుతున్న సమయంలో కొన్ని సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి చేస్తే నియామకాల్లో కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తుంది. సెల్స్‌ఫోర్సు, ఏడబ్ల్యూఎస్, సర్వీస్‌ నౌ, పెగా లాంటి సర్టిఫికేషన్‌ కోర్సుల ఆధారిత నియామకాలు కొనసాగుతున్నాయి. ఎక్కువ వేతన ప్యాకేజీలకు డిజిటల్‌ నైపుణ్యాలను పరిశీలిస్తున్నారు. కృత్రిమ మేధ, మెషిన్‌లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బిగ్‌డేటా లాంటి వాటిల్లో మెరిట్‌ చూస్తున్నారు. కొన్ని కంపెనీలు తొలుత శిక్షణ ఇచ్చి, అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరచిన వారిని ఎంపిక చేసుకుని వివిధ ప్యాకేజీలతో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.