TG DSC 2024 Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్‌ ‘కీ’లోనూ తప్పులు.. మార్కులు కలపాల్సిందేనంటూ డిమాండ్‌!

డీఎస్సీ పరీక్షల ఆన్సర్‌ కీపై రగడ ఇంకా చల్లారలేదు. ఇప్పటికే పరీక్షలో పలు ప్రశ్నలు పునరావృతం కాగా, ఇటీవలే విడుదలైన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’లో లెక్కలేనన్ని తప్పులు దొర్లాయి. దీంతో అభ్యర్ధులు ఏకంగా 28 వేలకుపైగా అభ్యంతరాలు తెలిపారు. వీటిని పరిశీలించిన తర్వాత తాజాగా పాఠశాల విద్యాశాఖ తుది ఆన్సర్‌ కీ విడుదల చేసింది కూడా. అయితే డీఎస్సీ ఫైనల్‌ ‘కీ’లోనూ తప్పులు వచ్చాయంటున్నారు..

TG DSC 2024 Final Key: తెలంగాణ డీఎస్సీ ఫైనల్‌ ‘కీ’లోనూ తప్పులు.. మార్కులు కలపాల్సిందేనంటూ డిమాండ్‌!
TG DSC 2024 Final Key
Follow us

|

Updated on: Sep 10, 2024 | 10:03 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్ 10: డీఎస్సీ పరీక్షల ఆన్సర్‌ కీపై రగడ ఇంకా చల్లారలేదు. ఇప్పటికే పరీక్షలో పలు ప్రశ్నలు పునరావృతం కాగా, ఇటీవలే విడుదలైన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’లో లెక్కలేనన్ని తప్పులు దొర్లాయి. దీంతో అభ్యర్ధులు ఏకంగా 28 వేలకుపైగా అభ్యంతరాలు తెలిపారు. వీటిని పరిశీలించిన తర్వాత తాజాగా పాఠశాల విద్యాశాఖ తుది ఆన్సర్‌ కీ విడుదల చేసింది కూడా. అయితే డీఎస్సీ ఫైనల్‌ ‘కీ’లోనూ తప్పులు వచ్చాయంటున్నారు పలువురు డీఎస్సీ అభ్యర్ధులు. కొన్ని ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చారని, కొన్ని ప్రశ్నలకైతే ఇచ్చిన ఆప్షన్లలో అసలు సమాధానాలే లేవని అభ్యర్థులు మండిపడుతున్నారు. సోమవారం 100 మందికి పైగా అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కు వచ్చి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా జూలై 22, 23న జరిగిన ఎస్జీటీ ఫైనల్‌ ‘కీ’ పై అత్యధికంగా అభ్యంతరాలు వెలిబుచ్చారు. ఆ తప్పులన్నీ సవరించి, మార్కులు కలపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

అభ్యర్థుల అభ్యంతరాల నేపథ్యంలో డీఎస్సీ ఫలితాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వంద మందికి పైగా అభ్యర్థులు ఫైనల్‌ కీపై అభ్యంతరాలు వ్యక్తంచేయగా, వాటిని పరిశీలించి మరోసారి సబ్జెక్టు నిపుణుల కమిటీకి ఆధారాలు పంపిస్తామని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి హామీ ఇచ్చారు. తప్పులు నిజంగానే దొర్లాయని నిపుణుల కమిటీ గుర్తిస్తే మళ్లీ రివైజ్డ్‌ ‘కీ’ని విడుదల చేయాల్సి ఉంటుంది. ఇదంతా పూర్తైతేగానీ డీఎస్సీ ఫలితాలు వస్తాయి. అనంతరం డీఎస్సీలో వచ్చిన మారులు, టెట్‌ మారులను కలిపి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను విడుదల చేస్తారు. ఆ తర్వాత 1:3 నిష్పత్తిలో మెరిట్‌ లిస్టు ప్రకటించి, వారందరికీ ధ్రువపత్రాల పరిశీలన జరుపుతారు. తుది ‘కీ’ లోనూ తప్పులు దొర్లితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. తెలుగు, సోషల్ స్టడీస్‌, ఎస్‌జీటీ పరీక్షల్లో ఈ తప్పులు ఎక్కువగా దొర్లాయి.

తప్పుడు సమాధానాలు ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ జాబితా చేసి, వాటికి సరైన సమాధానాలు ఏమిటో కూడా చేర్చి, ఆ వివరాలను డీఎస్సీ అభ్యర్ధులు అధికారులకు అందించారు. వీటన్నింటికీ మార్కులు కలపాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.