AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gallbladder: కోటా వైద్యుల అరుదైన శస్త్ర చికిత్స.. వృద్ధుడి పిత్తాశయంలో ఏకంగా 6,110 రాళ్లు!

రాజస్థాన్‌లోని కోటాలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు ఆరుదైన శస్త్ర చికిత్స చేశారు. 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయం నుంచి ఏకంగా 6,110 రాళ్లను తొలగించారు. కడుపునొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, వాంతుల వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగికి కష్టతరమైన సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు...

Gallbladder: కోటా వైద్యుల అరుదైన శస్త్ర చికిత్స.. వృద్ధుడి పిత్తాశయంలో ఏకంగా 6,110 రాళ్లు!
Stones In Gallbladder
Srilakshmi C
|

Updated on: Sep 09, 2024 | 10:26 AM

Share

కోటా, సెప్టెంబర్ 9: రాజస్థాన్‌లోని కోటాలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు ఆరుదైన శస్త్ర చికిత్స చేశారు. 70 ఏళ్ల వృద్ధుడి పిత్తాశయం నుంచి ఏకంగా 6,110 రాళ్లను తొలగించారు. కడుపునొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, వాంతుల వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగికి కష్టతరమైన సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకెళ్తే..

బూందీ జిల్లా పదంపురకు చెందిన 70 యేళ్ల వృద్ధుడు కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, వాంతులు వంటి లక్షణాలతో 18 నెలలుగా ఇబ్బంది పడుతున్నాడు. గతంలో కోటలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా.. ఓపెన్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 6న ఆయనకు వైద్యులు సోనోగ్రఫీని చేయించుకున్నాడు. అయితే అతడి పిత్తాశయంలో పైత్యరసం లేదని, దాని పరిమాణం 12×4 సెం.మీ ఉన్నట్లు గుర్తించారు. పిత్తాశయం పూర్తిగా రాళ్లతో నిండిపోయి దాని పరిమాణం రెట్టింపులో ఉన్నట్లు తేలింది. దీంతో అది పొడవుగా సాగి అసౌకర్యానికి గురి చేస్తుందని లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ దినేష్ జిందాల్ తెలిపారు. సాధారణంగా పిత్తాశయం పరిమాణం సుమారు 7×4 సెం.మీ ఉంటుంది. అయితే దాని పరిమాణం దృష్ట్యా వైద్యులకు ఆపరేషన్‌ చేయడం సవాలుగా మారింది.

వెంటనే లాప్రోస్కోపిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దినేశ్‌ కుమార్‌ నేతృత్వంలో వైద్యబృందం శస్త్రచికిత్స ప్రారంభించారు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా పిత్తాశయం చిల్లులు పడి, రాళ్ళు పొత్తికడుపు అంతటా వ్యాపించి, ప్రమాదాన్ని రెట్టింపు చేసేవి. అలా జరగకుండా వైద్యులు చాకచక్యంగా ఆపరేషన్‌ నిర్వహించి.. పిత్తాశయాన్ని పూర్తిగా తొలగించారు. ఆ రాళ్లను తొలగించకపోతే క్లోమం వాపు, కామెర్లు, క్యాన్సర్‌ వంటి వాటి బారినపడే ప్రమాదం ఉండేదని డాక్టర్‌ దినేశ్‌ తెలిపారు. ఆపరేషన్‌లో పాల్గొన్న డాక్టర్ జిందాల్ మాట్లాడుతూ.. ఎండో-బ్యాగ్‌ని ఉపయోగించి పిత్తాశయం తొలగించాం. ఈ సర్జరీకి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టిందని, శుక్రవారం ఆపరేషన్‌ చేసి, శనివారం డిశ్చార్జి చేశామన్నారు. తరువాత పిత్తాశయం తెరచి చూస్తే.. అందులో 6,110 రాళ్లు ఉన్నాయని తెలిపారు. గతంలో కూడా 45 ఏళ్ల రోగి పిత్తాశయం నుంచి 5,070 రాళ్లను తొలగించామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రోహిత్ శర్మ కెప్టెన్సీ కోల్పోవడం వెనుక ఆ ఇద్దరి హస్తం
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
రూ.8 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు ఇవే
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
'అనసూయకు చీర' ఛాలెంజ్ విసిరిన బీజేపీ నాయకురాలు..చిన్మయి రియాక్షన్
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు